ఈ విశ్వంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. అలాంటి ఓ వింతనే తాజాగా పరిశోధకులు గుర్తించారు. మెర్య్యూరీ గ్రహం కింద వజ్రాల పొర ఉన్నట్లు తాజాగా అధ్యయనంలో తేలింది.
నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. ఈ వజ్రపు పొర సుమారు 15 కిలోమీటర్లు మందంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ వజ్రాలను వెలికి తీయడం మాత్రం సాధ్యం కాదని పరిశోధకులు చెబుతున్నారు.
కానీ ఈ వజ్రాల ద్వారా మన విశ్వానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాధానాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ గ్రహంపై ఉన్న వజ్రాలను వెలికితీయలేక పోవడానికి ప్రధాన కారణం అక్కడి ఉష్ణోగ్రతే. ఈ గ్రహంపై పగటిపూట ఉష్ణోగ్రత ఏకంగా 430 డిగ్రీలు ఉంటుంది. అలాగే ఉపరితలం నుంచి సుమారు 485 కి.మీల లోతులో ఉండడం కారణంగానే వజ్రాలను వెలికి తీయడం అసాధ్యం.
ఇదిలా ఉంటే మెర్క్యూరి గ్రహం భూమి కంటే చాలా బలహీనంగా ఉంటుంది. తొలిసారి నాసా మెసెంజర్ ఈ గ్రహంపై కార్బన్ ఉనికిని గుర్తించింది. ఈ కార్బన్ ఉనికి శాస్త్రవేత్తల్లో ఆశలను చిగురించేలా చేసింది.
సూర్యుడికి అతి దగ్గర్లో ఉండే గ్రహం మెర్య్యూరీ. సౌర వ్యవస్థలో ఉన్న అతి చిన్న గ్రహం కూడా ఇదే. ఈ గ్రహం అయస్కాంత క్షేత్రం భూమి కంటే తక్కువగా ఉంటుంది. మెర్క్యూరీ గురుత్వాకర్షణ మార్స్‌తో సమానంగా ఉంటుంది.
వేడి శిలాద్రదం చల్లబడడం కారణంగానే ఈ గ్రహం ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతారు. మెర్క్యూరీలో కార్టన్, సిలికేట్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లోహాలు గడ్డకట్టడం వల్లే మాంటిల్ కోర్ ఏర్పడి ఉండొచ్చని అంటున్నారు.
2019లో నిర్వహించిన అధ్యయనంలో మెర్క్యూరీ ఉపరితలం నుంచి 50 కి.మీల లోతులో ఈ కార్బన్ ఉందని గుర్తించారు. ఈ కార్బన్ డైమండ్‌గా మారడానికి కారణమై ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.