ఫోన్ నంబర్ అవసరం లేకుండానే వాట్సాప్ చాటింగ్.. !

24 July 2024

TV9 Telugu

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సౌకర్యార్థం రోజుకు ఫీచర్ తీసుకొస్తుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్‌ను పరిచయం చేసింది.

 వాట్సాప్

తాజాగా యాప్ కోర్ ఫీచర్‌లో కీలక మార్పు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా మొబైల్ ఫోన్ ఆధారంగా వాట్సాప్ పని చేస్తుంది.

కోర్ ఫీచర్‌

ఇప్పుడు ఆ అవసరం లేదని వాబీటా ఇన్ఫో చెబుతోంది. యూజర్లు తమ ప్రొఫైల్స్ కోసం విశ్వజనీన యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

వాబీటా ఇన్ఫో 

 ఈ యూజర్ నేమ్స్ తో ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ ఖాతాలను తెరవడంతోపాటు వాటిల్లో చాటింగ్ చేయవచ్చు. ఇది ప్రస్తుతానికి వాట్సాప్ వెబ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో

యూజర్ నేమ్స్ తో

అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్  రిఫైన్ చేసిన తర్వాత వాట్సాప్ వెబ్ న్యూ ఇంటర్ ఫేస్‌ను ప్రదర్శిస్తుంది. 

వాట్సాప్ వెబ్ న్యూ

ఫోన్ నంబర్ షేర్ చేయకుండానే ఆన్‌లైన్‌లో యూజర్లు అనేబుల్ చేసుకోవడానికి, ఇతరులతో కనక్ట్ కావడంలో ప్రైవసీకి ప్రాధాన్యం కల్పిస్తారు. 

ఫోన్ నంబర్

 కొత్తగా క్రియేట్ చేసుకునే యూజర్ నేమ్ వల్ల ప్రైవసీకి అదనపు లేయర్ కానుంది. అటుపై మీ వ్యక్తిగత సమాచారానికి మరింత రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. 

యూజర్ నేమ్

ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్.. త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉండగా, యూజర్ల కోసం వాట్సాప్‌ ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువస్తోంది.

ఈ ఫీచర్