మనకు కొన్ని అపురూపమైన సందర్భాలు ఉంటాయి. వాటిని ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకుంటూ ఉంటాం. అనుకోని విధంగా ఆ ఫొటోలు లేదా వీడియోలు డిలీట్ అయిపోయినా.. మిస్ అయిపోయినా బాధ పడతాం. అలాంటి మీ ఫోన్లోని ఓ యాప్.. పొరపాటున డిలీట్ అయిన ఫొటోలను తిరిగి అందివ్వగలుగుతుంది. మీ జ్ఞాపకాన్ని భద్రంగా ఉంచుతుంది. ఆ యాపే గూగుల్ ఫొటోస్ యాప్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
గూగుల్ ఫొటోస్ యాప్.. దీని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ ఉంటుంది. దాని సాయంతో ఫొటోలను స్టోర్ చేసుకోవచ్చు. అయితే అనుకోని విధంగా గూగుల్ ఫొటోలను యాక్సిడెంటల్ గా డిలీట్ చేస్తే.. అది మీకు బాగా కావాల్సిన ఫొటో అయితే చాలా బాధ అనిపిస్తుంది. దానిని తిరిగి రిస్టోర్ చేసుకునే అవకాశం గురించి వెతుకుతారు. ఈ కథనంలో దాని గురించే తెలియజేస్తున్నాం. మీరు ఇటీవల గూగుల్ ఫొటోల్లోని చిత్రాలను ఏమైనా డిలీట్ చేస్తే వాటిని తిరిగి పొందుకునే అవకాశం ఉంది. ఆ ప్రక్రియ చాలా సింపుల్ గా ఉంటుంది.
సాధారణంగా డిలీట్ చేసిన ఫొటోలు ట్రాష్ ఫోల్డర్లో 60 రోజుల వరకూ స్టోర్ అయ్యి ఉంటాయి. ఆ తర్వాత పర్మినెంట్ గా డిలీట్ అవుతాయి. అప్పటి వరకూ మీరు ఆ ఫొటోలను రిస్టోర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ట్రాష్ ఫోల్డర్ ను మీరు ఎంటీ చేస్తే మాత్రం ఆ ఫొటో శాశ్వతంగా డిలీట్ అయిపోతాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..