Electric Scooters: ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లకి మార్కెట్లో మంచి డిమాండ్.. పెరిగిన ఇంధన ధరలకి ప్రత్యామ్నాయం..!

|

Apr 29, 2022 | 8:25 AM

Electric Scooters: పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు చాలా ఇబ్బందిపడుతున్నారు. అటువంటి వారికి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.

Electric Scooters: ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లకి మార్కెట్లో మంచి డిమాండ్.. పెరిగిన ఇంధన ధరలకి ప్రత్యామ్నాయం..!
Electric Scooter
Follow us on

Electric Scooters: పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు చాలా ఇబ్బందిపడుతున్నారు. అటువంటి వారికి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. వినియోగదారులు తక్కువ డబ్బుతో మెరుగైన డ్రైవింగ్ పరిధిని పొందవచ్చు. అంతేకాకుండా వీటివల్ల ఎటువంటి కాలుష్యం కూడా ఉండదు. ప్రభుత్వం వాటికి సబ్సిడీని కూడా అందిస్తోంది. తక్కువ ఖర్చుతో వీటిని ఇంటికి తీసుకురావచ్చు. అంతేకాదు మెయింటెన్‌ ఖర్చు కూడా చాలా తక్కువ. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కి.మీల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలవు. అందుకే ఈ రోజు కొన్ని ఎలక్ట్రిక్‌ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.

1.Ola S1 Pro: ఓలా ఎలక్ట్రిక్‌ భారతీయ మార్కెట్లో Ola S1 ప్రో స్కూటర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ధర రూ. 1.27 లక్షలు. ఇది ఒక వేరియంట్‌లో మాత్రమే వస్తుంది. ఇందులో ఇచ్చిన మోటార్ 5500 వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

2. Ather 450X: భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,40,280. ఇది 2 వేరియంట్లు, 3 రంగులలో వస్తుంది. దీని టాప్ వేరియంట్ ధర రూ.1,59,291. ఈ స్కూటర్ దాని మోటార్ నుంచి 3300 వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముందు వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు ఉంటుంది.

3. Simple One Electric: సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ పరిధిని అందిస్తాయి. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 105 కి.మీ. అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన సమాచారం ప్రకారం.. ఈ స్కూటర్ కేవలం 2.95 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగాన్ని అందుకోగలదు.

4. Okinawa Okhi 90: ఒకినావా నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం 1.21 లక్షల రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కి.మీల వరకు ప్రయాణించగలదు. ఇది లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఢిల్లీలో దీని ధర దాదాపు 1.03 లక్షల రూపాయలుగా ఉంది.

5. Bajaj Chetak EV: ఇప్పుడు ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో దూసుకుపోతుంది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మీరు ఈ స్కూటర్‌ను రూ.1,42,297కి కొనుగోలు చేయవచ్చు. ఇది 2 వేరియంట్లు, 6 రంగులలో వస్తుంది. బజాజ్ చేతక్ EV దాని మోటార్ నుంచి 3800 W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని పరిధి 95 కి.మీ. ఇది ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చాణక్య నీతి: చాణక్యుడి ప్రకారం యవ్వనంలో ఈ విషయాలు కచ్చితంగా పాటించాలి..!

Cricket Photos: ఈ దిగ్గజ ఆటగాడు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరేవాడు.. ఈ రోజు ఆయన పుట్టినరోజు..

Health Tips: బలహీనమైన నరాల కారణంగా గుండెపోటు.. ఈ అలవాట్లు కచ్చితంగా పాటించండి..!