Google: ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ప్రైవసీ విషయాలో భారీ మార్పులు..!

|

Feb 23, 2022 | 5:48 PM

Google: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. యూజర్ల కోసం గూగుల్‌ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక తాజాగా ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్‌ త్వరలో..

Google: ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ప్రైవసీ విషయాలో భారీ మార్పులు..!
Follow us on

Google: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. యూజర్ల కోసం గూగుల్‌ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక తాజాగా ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్‌ త్వరలో గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. యూజర్ల ప్రైవసీ విషయంలో భారీ మర్పులు చేసేందుకు సిద్ధమవుతోంది గూగుల్‌. ఈ మార్పు కారణంగా ఆండ్రాయిడ్‌ యూజర్లకు యాపిల్‌ (Apple) తరహాలో భద్రత కలుగనుంది. ఇక బాటలోనే గూగుల్‌ పయనించనుంది. ఐఫోన్లకు అందించే యూజర్‌ ప్రైవసీని ఆండ్రాయిడ్‌ (Android ) స్మార్ట్‌ఫోన్‌లకు తీసుకువచ్చేందుకు గూగుల్‌ ఈ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 2021 ఏప్రిల్‌లో ఐఫోన్ల కోసం కొత్త యూజర్‌ ప్రైవసీ పాలసీ (Privacy Policy)ని యాపిల్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో థర్డ్‌ పార్టీ యాప్స్‌ సదరు యూజర్‌ను ట్రాక్‌ చేయకుండా చేసే ఫీచర్‌ను యాపిల్‌ అందిస్తోంది. ఇదే ఫీచర్‌ను గూగుల్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

ప్రైవసీ మార్పుల గురించి ఆండ్రాయిడ్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఉపాధ్యక్షుడు ఆంథోనీచవెన్‌ ఓ బ్లాక్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రైవేటు అడ్వర్టయిజింగ్‌ సొల్యూషన్లు, కొత్త ప్రైవసీని తీసుకువచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామని అన్నారు. ఇక థర్డ్‌పార్టీలతో డేటాను షేర్‌ చేయడాన్ని తగ్గిస్తామని వెల్లడించారు. అయితే ఈ మార్పులు అందుబాటులోకి తీసుకురావాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుందన్నారు. థర్డ్‌ పార్టీ యాప్‌ యూజర్ల డేటా షేర్‌ చేసే అంశంలో గూగుల్‌ కొత్త ప్రైవసీ సాండ్‌ బాక్స్‌ ఫీచర్‌ను తీసుకురానుంది.

ఇవి కూడా చదవండి:

RBI: అప్రమత్తంగా ఉండండి.. ఈ యాప్‌ వాడేవారికి రిజర్వ్‌ బ్యాంక్‌ హెచ్చరిక..!

Whatsapp: యూజర్ల భద్రత కోసం మరో ముందడుగు వేసిన వాట్సాప్‌.. సేఫ్టీ ఇన్ ఇండియా పేరుతో..