Google Maps: ఇకపై గూగుల్‌ మ్యాప్స్‌లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. సూపర్ ఫీచర్స్‌

|

Oct 29, 2023 | 9:27 PM

దీంతో అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌లో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇప్పటికే గూగుల్ తన సెర్చ్‌ ఇంజన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే తాజాగా గూగుల్‌ మ్యాప్స్‌లోనూ ఏఐ సేవలను తీసుకురానుంది. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ గూగుల్ మ్యాప్స్‌ సేవలపై ఆధారపడుతోన్న తరుణంలో యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు...

Google Maps: ఇకపై గూగుల్‌ మ్యాప్స్‌లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. సూపర్ ఫీచర్స్‌
Google Maps
Follow us on

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతీ రంగంలో కృత్రిమ మేథ ఉపయోగం అనివార్యంగా మారిపోయింది. టెక్నాలజీని సరికొత్త పుంతలు తొక్కిస్తూ సరికొత్త శకానికి నాంది పలుకుతోంది ఏఐ విప్లవం. ఇక కృత్రిమ మేథ కారణంగా రానున్న రోజుల్లో ఉద్యోగాలు పోనున్నాయని జరుగుతోన్న వాదనలో ఎంత నిజం ఉందో, ఏఐ రాకతో ప్రజలకు టెక్నాలజీ మరింత చేరువైందని చెప్పాలి.

దీంతో అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌లో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇప్పటికే గూగుల్ తన సెర్చ్‌ ఇంజన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే తాజాగా గూగుల్‌ మ్యాప్స్‌లోనూ ఏఐ సేవలను తీసుకురానుంది. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ గూగుల్ మ్యాప్స్‌ సేవలపై ఆధారపడుతోన్న తరుణంలో యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు గాను గూగుల్‌ ఏఐ సేవలను విస్తరిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా యూజర్లకు మెరుగైన నావిగేషన్‌ సేవలు అందించవచ్చని గూగుల్‌ చెబుతోంది.

‘ఇమ్మర్సివ్ వ్యూ’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకురానునన్నట్లు ప్రకటించింది. దీంతో మరింత కచ్చితత్వంతో అడ్రస్‌లు తెలసుకోవచ్చని గూగుల్ తెలిపింది. డ్రైవింగ్‌ లేదా నడక మార్గంలో కొత్త ప్రదేశాలకు వెళ్లిన వారికి ఈ కొత్త ఫీచర్‌ మరెంతో ఉపయోగపడుతుంది. వెళ్తున్న దారిలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ను, వెదర్‌ రిపోర్ట్‌ను కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న మ్యాప్స్‌ సేవలకు ఈ కొత్త ఫీచర్‌ మరింత మెరుగైన సేవలను అందించనుంది.

గూగుల్ ఇప్పటికే ఈ ఫీచర్‌ను ఆమ్‌స్టర్‌డామ్, బార్సిలోనా, డబ్లిన్, ఫ్లోరెన్స్, లాస్ వెగాస్, లండన్, లాస్ ఏంజెల్స్, మయామి, న్యూయార్క్, పారిస్, శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ జోస్, సీటెల్, టోక్యో, వెనిస్ వంటి ఎంపిక చేసిన నగరాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ ఏఐ ఫీచర్‌తో యూజర్లు చుట్టు పక్కల ఉన్న దుకాణాలు, ఈవీ స్టేషన్స్‌, రెస్టారెంట్స్‌, ఏటీఎమ్‌ల సమాచారాన్ని అందిస్తుంది. ఇందుకోసం గూగుల్‌ లెన్స్‌ ఫీచర్‌ను మ్యాప్స్‌లో తీసుకురానున్నారు. ఈ కొత్త ఫీచర్‌ను త్వరలోనే భారత్‌లో లాంచ్‌ చేయనున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..