Google Chrome: ఇంటర్నెట్ వినియోగదారులకు గూగుల్ కీలక హెచ్చరిక.. అలా చేయకుంటే ఇక అంతే సంగతులు!

|

Nov 03, 2021 | 8:44 AM

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 4 బిలియన్ల (400 కోట్లకు)పైగా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లు హ్యాకింగ్ గురైనట్లు ఇటీవల వెల్లడైంది.

Google Chrome: ఇంటర్నెట్ వినియోగదారులకు గూగుల్ కీలక హెచ్చరిక.. అలా చేయకుంటే ఇక అంతే సంగతులు!
Google Chrome
Follow us on

Google Chrome warning: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్‌యే ప్రపంచం. పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్కరు ఇంటర్నెట్‌లో మునిగిపోతుంటారు. ముఖ్యంగా ఏ అవసరం వచ్చిన, ఏ సమాచారం తెలుసుకోవాలనుకున్న గూగుల్ క్రోమ్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే క్రోమ్ యూజర్స్‌కి హ్యాకింగ్ ముప్పు పొంచి ఉన్నట్లు సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 4 బిలియన్ల (400 కోట్లకు)పైగా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లు హ్యాకింగ్ గురైనట్లు ఇటీవల వెల్లడైంది. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థ క్రోమ్ వినియోగదారులకు కీలక సూచనలు జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్‌ని తరచుగా ఉపయోగించే యూజర్స్‌ తరచుగా తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని కోరింది. అలాగే, క్రోమ్ బ్రౌజర్‌లోని హిడెన్ ఫీచర్స్‌ని యూజర్స్ ఉపయోగించాలని పేర్కొంది. గూగుల్‌ రిమెంబర్‌ దిస్‌ పాస్‌వర్డ్ ఫీచర్‌ ద్వారా హ్యాకింగ్ దాడులు పెరిగే అవకాశమున్న దృష్ట్యా ఇది యూజర్‌కి మరింత భద్రత కల్పిస్తుందని వెల్లడించింది. అయితే, క్రోమ్‌లో పాస్‌వర్డ్ టైప్‌ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసుకుంటే, ఒకవేళ పాస్‌వర్డ్‌ని ఎవరైనా హ్యాక్‌ చేస్తే గూగుల్ యూజర్‌కు ఇట్టే తెలియజేస్తుందని తెలిపింది.

గూగుల్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత డేటా హ్యాకింగ్‌కు గురికాకుండా ఉండేందుకు 2019లో గూగుల్ నిర్వహించిన తొలి పరీక్షల్లో 6,50,000 మంది పాల్గొన్నట్లు గూగుల్‌ ప్రతినిధి జెన్నీఫర్ తెలిపారు. వీటిలో సుమారు 3 లక్షల యూజర్ నేమ్‌, పాస్‌వర్డ్‌లు సురక్షితమైనవి కాదని గుర్తించినట్లు చెప్పారు. థర్డ్‌పార్టీ టూల్స్‌ కారణంగా హ్యాకర్స్‌కు అందిన సమాచారంతో వారు తరచుగా యూజర్‌ ఖాతాలను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటారని.. ఒకవేళ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ పటిష్ఠంగా ఉంటే మాత్రం హ్యాక్‌ చేయలేరని తెలిపారు. గూగుల్ క్రోమ్‌ లేదా రిమెంబర్‌ దిస్‌ పాస్‌వర్డ్‌ ఫీచర్‌ ఉపయోగించే యూజర్ పాస్‌వర్డ్ సురక్షితం కాదని భావిస్తే గూగుల్ వారిని పాస్‌వర్డ్ మార్చుకోమని సూచిస్తుంది. అలాగే, మీ ఖాతాకు సంబంధించి ఏదైనా అనుమానాస్పద లాగిన్ జరిగినా వెంటనే మీ మొబైల్ లేదా మెయిల్‌కి అలర్ట్ మెసేజ్‌ వస్తుంది. అలానే మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ని కూడా తరచుగా మార్చుకోవమని సూచిస్తామని గూగుల్ తెలిపింది.

Read Also….  Facebook: ఫేస్‌బుక్‌ మరో సంచలన నిర్ణయం.. ఇకపై ఆ ఫీచర్ అందుబాటులో ఉండదని కీలక ప్రకటన