Google Chrome Users Alert: గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు హెచ్చరిక.. ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..!

|

Feb 10, 2022 | 10:09 AM

Google Chrome Users Alert: ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించేది గూగుల్‌ క్రోమ్‌. అయితే గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను వాడే వారికి కేంద్ర సర్కార్‌ మరో హెచ్చరిక జారీ చేసింది..

Google Chrome Users Alert: గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు హెచ్చరిక.. ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..!
Follow us on

Google Chrome Users Alert: ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించేది గూగుల్‌ క్రోమ్‌. అయితే గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను వాడే వారికి కేంద్ర సర్కార్‌ మరో హెచ్చరిక జారీ చేసింది. గూగుల్‌ బ్రౌజర్‌ (Google Browsers)లో కొన్ని లోపాలున్నాయని ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (Indian Computer Emergency Response Team) ఏజెన్సీ వెల్లడించింది. ఈ లోపాల కారణంగా యూజర్లను హ్యకర్లు సులభంగా దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది. ఆర్బిట్రరీ కోడ్‌ను ఉపయోగించుకుని హ్యాకర్స్ (Hackers) గూగుల్‌ క్రోమ్‌ ద్వారా ఆయా ఫోన్‌లలోకి, కంప్యూటర్‌లలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల డేటా మొత్తం తస్కరించే అవకాశం ఉందని సూచించింది.

గూగుల్‌ క్రోమ్‌లో లోపాలు..

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో కొన్ని కేటగిరిల్లో లోపాలు ఉన్నట్లు టీమ్‌ గుర్తించింది. యూజ్‌ ఆఫ్టర్‌ ఫ్రీ ఇన్‌ సేఫ్‌ బ్రౌజింగ్‌, రీడర్‌ మోడ్, వెబ్ సెర్చ్, థంబ్‌నెయిల్ ట్యాబ్ స్ట్రిప్, స్క్రీన్ క్యాప్చర్, విండో డైలాగ్, పేమెంట్స్‌, ఎక్స్‌టెన్షన్స్‌, యాక్సెసిబిలిటీ అండ్‌ క్యాస్ట్‌ స్క్రీన్, పూర్తి స్క్రీన్ మోడ్, స్క్రోల్, ఎక్స్‌టెన్షన్స్ ప్లాట్‌ఫారమ్ అండ్‌ పాయింటర్ లాక్‌, అలాగే COOPలో పాలసీ బైపాస్, వీ8లో అవుట్ ఆఫ్ బౌండ్స్ మెమరీ యాక్సెస్కాప్చర్స్‌ వంటి తదితర లోపాలున్నాయని తెలియజేసింది. ఈ కారణంగా సైబర్‌ నేరగాళ్లు గూగుల్‌ క్రోమ్‌ యూజర్ల డేటాను దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక క్రోమ్‌ 98 వెర్షన్‌ను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపింది. గూగుల్ క్రోమ్ వెర్షన్ 98.0.4758.80 కంటే ముందు వెర్షన్‌ వాడుతున్న వాళ్లు మాత్రం వెంట‌నే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి:

Tesla Recalls: వాహనదారుల మెడకు చుట్టుకుంటున్న టెక్నికల్‌ ఎర్రర్‌.. వేలాది వాహనాలు వెనక్కి

Digital Voter ID Card: మీ డిజిటల్‌ ఓటర్‌ ఐడి కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాలా..? ఇలా చేయండి..!