Xiaomi Phones Warranty: ఆ ఎంఐ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్… రెండేళ్ల పాటు అదనపు వారెంటీ

| Edited By: seoteam.veegam

Jun 01, 2023 | 6:21 PM

ఎంఐ కంపెనీ తన డిస్కార్డ్ హ్యాండిల్ ద్వారా పొడిగింపును ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని ట్విట్టర్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్‌ చేయలేదని టెక్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంఐ కొత్త పొడిగింపు కోసం ఫోన్‌ల జాబితా, అర్హత వివరాలను వెల్లడించింది. కొన్ని మోడల్స్ ఫోన్లకు మాత్రమే ఈ వారెంటీ ఆఫర్ వర్తిస్తుంది.

Xiaomi Phones Warranty: ఆ ఎంఐ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్… రెండేళ్ల పాటు అదనపు వారెంటీ
Smartphones
Follow us on

ఎంఐ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యంగా కొన్ని ఫోన్‌ల వారెంటీని రెండేళ్లపాటు పొడిగించింది. కంపెనీ తన డిస్కార్డ్ హ్యాండిల్ ద్వారా పొడిగింపును ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని ట్విట్టర్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్‌ చేయలేదని టెక్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంఐ కొత్త పొడిగింపు కోసం ఫోన్‌ల జాబితా, అర్హత వివరాలను వెల్లడించింది. కొన్ని మోడల్స్ ఫోన్లకు మాత్రమే ఈ వారెంటీ ఆఫర్ వర్తిస్తుంది. కెమెరా లేదా మదర్‌బోర్డు సంబంధిత సమస్య ఉన్న ఈ వారెంటీకి అర్హులు. అయితే వారంటీని పొడిగించడానికి కచ్చితమైన కారణం ప్రస్తుతం తెలియనప్పటికీ ఎంఐ తన కొన్ని ఫోన్‌లలో లోపాన్ని గుర్తించి ఉండవచ్చు నిపుణులు అంచనా. దీంతో నూతన వారంటీ పాలసీ ద్వారా ఉచిత సేవను అందిస్తుందని చెబుతున్నారు. అయితే పొడగింపు వారెంటీ విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా గుర్తించాల్సి ఉంది. ఎంఐ కంపెనీ ఏయే ఫోన్లపై వారెంటీ అందిస్తుందో? ఓ సారి చూద్దాం.

వారెంటీ వచ్చే ఫోన్లు ఇవే

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఎంఐ 11 అల్ట్రా, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, పోకో ఎక్స్ 3 ప్రో 2 ఫోన్లకు పెరిగిన  రెండు సంవత్సరాల వారెంటీ వస్తుంది. 

వారెంటీ పొందడం ఇలా

గత రెండేళ్లలో ఈ యూనిట్లలో దేనినైనా కొనుగోలు చేసిన వ్యక్తులు కొత్త వారంటీని పొందగలుగుతారు. దీంతో పాటు, సెల్ఫీ కెమెరా సమస్యలు, మదర్‌బోర్డ్ వైఫల్యాలను ఎదుర్కొనే వారు ఈ వారంటీకి అర్హులు. రూట్ చేసిన ఫోన్‌లు, లిక్విడ్ డ్యామేజ్ అయినవి, ట్యాంపర్ చేసినవి, లేదా విరిగిన కేసులు పొడిగించిన మద్దతు కోసం పరిగణించబడవని కంపెనీ తెలిపింది. వారెంటీని పొందడానికి కస్టమర్‌లు సమీపంలోని ఎంఐ సర్వీస్ సెంటర్‌ను సందర్శించవచ్చు. ఇక్కడ, వారికి ఫోన్ ఇన్‌వాయిస్‌ను  ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త రెండేళ్ల వారంటీ వచ్చే వారి ఫోన్ సమస్యలు కనుగొంటే వినియోగదారుల నుంచి  ఏదైనా రీప్లేస్‌మెంట్ లేదా మరమ్మతుల కోసం అదనపు ఛార్జీ వసూలు చేయరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..