ప్రస్తుత రోజుల్లో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగింది. స్మార్ట్‌ఫోన్ వినియోగం ఈ స్థాయిలో పెరగడానికి జియో అందించే సేవలను మనం తీసిపారేయలేము. భారతదేశంలోని టెలికాం మార్కెట్‌లో జియో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా సగటు వినియోగదారుడి చెంతకు మొబైల్ డేటా చేరేలా అతి తక్కువ ధరకు డేటాతో కూడిన రీచార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. జియో దెబ్బకు ఇతర కంపెనీలు కూడా డేటా ధరలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే ఇటీవల ఇతర కంపెనీల నుంచి పోటీనిచ్చేందుకు జియో కొన్ని రకాల రీచార్జ్ ప్లాన్స్‌పై ఎక్స్‌ట్రా డేటా ఆఫర్స్‌ను ప్రకటించింది. ముఖ్యంగా ప్రీపెయిడ్ ప్లాన్‌లతో వినియోగదారులకు బోనస్ డేటాను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌లు 3 జీబీ రోజువారీ డేటాతో వచ్చే డేటా ప్యాక్స్‌తోనే అందుబాటులో ఉంటాయి. జియో రూ.399, రూ.219 ప్లాన్‌లపై ఎక్స్‌ట్రా డేటా ఆఫర్స్ ప్రకటించింది. ఈ డేటా ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
రిలయన్స్ జియోకు చెందిన రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్/రోజు, 3 జీబీ రోజువారీ డేటాతో వస్తుంది. దీంతో పాటు వినియోగదారులు 6 జీబీ బోనస్ డేటాను పొందుతారు. సాధారణంగా ఈ ఎక్స్‌ట్రా ప్లాన్ ఖరీదు రూ.61 విలువైనది. అయితే ఈ డేటాను ప్రస్తుతానికి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వినియోగదారులకు అందిస్తుంది. పైగా ఈ ప్లాన్‌పై అదనపు ప్రయోజనాల కింద జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు కూడా వస్తాయి. ఈ ప్లాన్‌తో కస్టమర్‌లు అర్హత ఉన్న కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ సర్వీస్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.
జియో నుంచి రూ. 219 ప్రీపెయిడ్ ప్లాన్ 14 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజువారీ 3 జీబీ డేటాను కూడా అందిస్తుంది. దానితో పాటు, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్/రోజుకు ఉన్నాయి. రీఛార్జ్‌తో పాటు రూ. 25 విలువైన 2 జీబీ బోనస్ డేటాను కూడా పొందవచ్చు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలను కూడా అదనంగా పొందవచ్చు. పైగా అపరిమిత 5జీ డేటాను కూడా పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..