
Future Tech 2021: భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఫ్యూచర్ టెక్ 2021 ఈవెంట్‌ను ప్రారంభించింది. ఈ ఈవెంట్ నిన్న అంటే అక్టోబర్ 19న ప్రారంభమైంది. అక్టోబర్ 27 వరకు జరుగుతుంది. 9 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో, టెక్నాలజీ సాయంతో భవిష్యత్తు ఎలా కనెక్ట్ చేయబడుతుందనే విషయంపై చర్చిస్తారు. సాధారణ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనె అవకాశం ఉంది. టెక్నాలజీపై ఆసక్తి గలవారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. దీనికోసం వారు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో నమోదు కోసం, CII రిజిస్ట్రేషన్ లింక్‌ను కూడా పంచుకుంది.
ఈవెంట్ ఇలా జరుగుతుంది..
| రోజు | తేదీ | కార్యక్రమం |
| మొదటి రోజు | 19 అక్టోబర్ | ప్రారంభ రోజు |
| రెండవ రోజు | 20 అక్టోబర్ | డిజిటల్ మౌలిక సదుపాయాల దినోత్సవం |
| మూడవ రోజు | 21 అక్టోబర్ | డిజిటల్ స్ట్రాటజీ డే |
| నాల్గవ రోజు | 22 అక్టోబర్ | ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ డే |
| ఐదవ రోజు | 25 అక్టోబర్ | డేటా – అల్గోరిథంల రోజు |
| ఆరవ రోజు | 26 అక్టోబర్ | PSU డే |
| ఏడవ రోజు | 27 అక్టోబర్ | డిజిటల్ సెక్యూరిటీ డే |
అక్టోబర్ 23 మరియు 24 తేదీలలో ఈవెంట్లో విశ్రాంతి రోజులు ఉంటాయి. ఈ రెండు రోజుల్లో ఎలాంటి ఈవెంట్ నిర్వహించారు.
మీరు ఈవెంట్లో పాల్గోవచ్చు. ఈవెంట్లో, టెక్నాలజీకి సంబంధించిన వివిధ అంశాలపై సాధారణ ప్రజలు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. అయితే, ఈవెంట్‌కు హాజరు కావడానికి వారు తమను తాము నమోదు చేసుకోవాలి. నమోదు తర్వాత మాత్రమే వారు తమ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. దీని కోసం మీరు ఈ ప్రక్రియను అనుసరించాలి ..
రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: Vinai Thummalapally: అమెరికాలో హైదరాబాదీకి అరుదైన గౌరవం.. యుఎస్‌టిడిఎ డిప్యూటీ డైరెక్టర్ నియమించిన ప్రెసిడెంట్ జో బిడెన్
Pawan Kalyan: నిన్ను అలా అంటే మీ ఫ్యాన్స్ ఊరుకుంటారా? పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించిన ఏపీ మంత్రి