Whatsapp: ఫేక్‌ న్యూస్‌కు చెక్‌ పెట్టేందుకు వాట్సాప్‌ కొత్త ఫీచర్.. ఇకపై ఎలా పడితే అలా కుదరదు..

|

Mar 10, 2022 | 2:59 PM

Whatsapp: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌ (APP) ఏది అంటే గుర్తొచ్చే పేరు వాట్సాప్‌. కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకున్న ఈ యాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో (New Features) ఆట్రాక్ట్‌ చేస్తుంటుంది. ముఖ్యంగా వినియోగదారుల భద్రతకు భరోసానిస్తూ...

Whatsapp: ఫేక్‌ న్యూస్‌కు చెక్‌ పెట్టేందుకు వాట్సాప్‌ కొత్త ఫీచర్.. ఇకపై ఎలా పడితే అలా కుదరదు..
Whatsapp New Feature
Follow us on

Whatsapp: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌ (APP) ఏది అంటే గుర్తొచ్చే పేరు వాట్సాప్‌. కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకున్న ఈ యాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో (New Features) ఆట్రాక్ట్‌ చేస్తుంటుంది. ముఖ్యంగా వినియోగదారుల భద్రతకు భరోసానిస్తూ ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను తీసుకొచ్చిన వాట్సాప్‌. ఫేక్‌ న్యూస్‌కు కూడా చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను పరిచయం చేసిన ఈ దిగ్గజ సంస్థ తాజాగా మరో కొత్త ఎత్తుగడతో యూజర్ల ముందుకు రానుంది.

యూజర్ పంపించే మెసేజ్‌ ఎక్కువ సార్లు ఫార్వర్డ్‌ అయితే సదరు మెసేజ్‌కు ఫార్వార్డ్‌ అనే ట్యాగ్‌లైన్‌ కనిపించేలా ఇప్పటికే వాట్సాప్‌ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై ఎలా పడితే అలా మెసేజ్‌లను అన్ని గ్రూప్‌ల్లోకి ఫార్వడర్డ్‌ చేయడం కుదరకుండా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌ యూజర్లకు మెసేజ్‌లను ఒకటి కంటే ఎక్కువ గ్రూపుల్లోకి ఫార్వర్డ్‌ చేయడాన్ని పరిమితం చేయనుంది. దీంతో యూజర్ ఒక గ్రూప్‌ కంటే ఎక్కువ గ్రూప్స్‌లోకి మెసేజ్‌లను ఒకే సమయంలో ఫార్వర్డ్‌ చేయలేరు. దీంతో ఫేక్‌ న్యూస్‌కు అడ్డుకట్ట వేయొచ్చని వాట్సాప్‌ యోచిస్తోంది. ఈ ఫీచర్‌ తొలుత వాట్సాప్‌ బీటా వెర్షన్‌ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే యూజర్లను ఒకేసారి రెండు గ్రూప్‌లోకి మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేయలేడు కానీ సదరు మెసేజ్‌ను కాపీ చేసి ఇతర గ్రూప్‌లో షేర్‌ చేసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Viral Video: ఉత్తి చేతులతో బాంబు డిఫ్యూజ్ చేసిన ఉక్రేనియన్.. వీడియో చూస్తే మీకు ఫ్యూజులౌట్..!

UP Election Results: యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘనత.. 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండో సారి అధికారంలోకి..

AP Gov jobs 2022: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా 66,309 ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలోనే..