Google Maps: ఇంటర్‌నెట్‌ లేకుండానే గూగుల్‌ మ్యాప్స్‌.. ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు.

|

Jan 08, 2023 | 6:50 PM

ఒకప్పుడు ఏదైనా అడ్రస్‌ తెలియాలంటే పక్కనున్న వారిని అడుగుతూ గమ్యాన్ని చేరుకునే వాళ్లం. కానీ ప్రస్తుతం సింపుల్‌గా గూగుల్ మ్యాప్స్‌ ఓపెన్‌ చేసి గమ్య స్థానాన్ని సెలక్ట్ చేసుకుంటే చాలు ఎంచక్కా రూట్ గూగులే చెప్పోస్తోంది. ఏ దారిలో ట్రాఫిక్‌ తక్కువగా ఉంది.? ఎలా వెళితే గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చు.?

Google Maps: ఇంటర్‌నెట్‌ లేకుండానే గూగుల్‌ మ్యాప్స్‌.. ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు.
Google Maps
Follow us on

ఒకప్పుడు ఏదైనా అడ్రస్‌ తెలియాలంటే పక్కనున్న వారిని అడుగుతూ గమ్యాన్ని చేరుకునే వాళ్లం. కానీ ప్రస్తుతం సింపుల్‌గా గూగుల్ మ్యాప్స్‌ ఓపెన్‌ చేసి గమ్య స్థానాన్ని సెలక్ట్ చేసుకుంటే చాలు ఎంచక్కా రూట్ గూగులే చెప్పోస్తోంది. ఏ దారిలో ట్రాఫిక్‌ తక్కువగా ఉంది.? ఎలా వెళితే గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చు.? ఇలా అన్ని రకాల వివరాలను అందిస్తోంది. చివరికి మీరు వెళ్లే రూట్‌లో ఏమైనా టోల్‌ గేట్స్‌ ఉన్నాయా.? వాటి ధర ఎంత.? లాంటి సమాచారాన్ని గూగుల్‌ ఇస్తోంది. అయితే గూగుల్‌ మ్యాప్స్‌ ఉపయోగించాలంటే కచ్చితంగా ఇంటర్‌నెట్ ఉండాలనే విషయం తెలిసిందే.

అయితే ఇంటర్‌నెట్ సదుపాయం లేకుండా కూడా గూగుల్‌ను ఉపయోగించుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? అదేంటి ఇంటర్‌నెట్ లేకుండా మ్యాప్స్‌ యాప్‌నె ఎలా యాక్సెస్‌ చేయొచ్చనేగా మీ సందేహం. ఇందుకోసం గూగుల్ ఓ సింపుల్‌ ట్రిక్‌ను అందిస్తోంది. ఏదైనా లొకేషన్‌ను లేదా ప్రాంతాన్ని ముందుగానే సేవ్‌ చేసుకోవడం ద్వారా ఇంటర్‌ నెట్ సదుపాయం లేని సమయంలోనూ మ్యాప్స్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఫోన్‌లలోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇందుకోసం ఫాలో కావాల్సిన స్టెప్స్‌ మీకోసం..

* ముందుగా స్మార్టఫోన్‌లో ఉండే గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం ఎడమవైపు ఉన్న ప్రొఫెల్‌ పిక్‌పై క్లిక్‌ చేసిన ఆఫ్‌లైన్‌ మ్యాప్స్‌ను సెలక్ట్‌ చేయాలి.

* దీని తర్వాత మ్యాప్‌ను సెలక్‌ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని సెర్చ్‌ చేయాలి.

* వెంటనే మీరు కోరుకున్న రూట్‌తో కూడిన మ్యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది.

* ఈ మ్యాప్‌ ఇంటర్‌నెట్ కనెక్షన్‌ లేని సమయంలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. మీ ప్రయాణ సమయంలో డైరెక్షన్స్‌ చూపిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..