
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇటీవల సమ్మర్ సేల్స్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందించిన విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్‌తో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ తగ్గింపులు అందించాయి. అయితే ఈ సేల్ ఇప్పటికే ముగిసింది. అయితే ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ఓ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. వివో టీ2 ప్రో స్మార్ట్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది.? ఫీచర్లు ఎలా ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వివో టీ2 ప్రో స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 26,999కాగా 11 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 23,999కి సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 27,999కాగా, 10 శాతం డిస్కౌంట్‌తో రూ. 24,999కి సొంతం చేసుకోవచ్చు. అదనంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులో కొనుగోలు చేస్తే రూ. 2000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
ఇక వివో టీ2 ప్రో స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ అమో ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ చేస్తుంది. 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రోసెసర్ ఈ ఫోన్ సొంతం. ఇందులో 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో డ్యూయల్ కెమేరా సెటప్‌ను అందించారు. 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..