HP Chromebook: రూ. 19 వేలలో సూపర్ ల్యాప్‌టాప్‌.. హెచ్‌పీ కంపెనీ..

|

Aug 10, 2024 | 5:55 PM

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాగ్‌షిప్‌ ఇండిపెండెన్స్‌ సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా గృహోపకరణాలు మొదలు, అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ వరకు భారీ డిస్కౌంట్‌ లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగానే ల్యాప్‌టాప్స్‌పై కూడా ఊహకందని తగ్గింపు ధరలు లభిస్తున్నాయి. ఇలాంటి ఓ బెస్ట్ ల్యాప్‌టాప్‌ డీల్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

HP Chromebook: రూ. 19 వేలలో సూపర్ ల్యాప్‌టాప్‌.. హెచ్‌పీ కంపెనీ..
Hp Chromebook
Follow us on

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం ఎంత ఎక్కువైందో, ల్యాప్‌టాప్‌ల ఉపయోగం కూడా అదే స్థాయిలో పెరిగింది. మరీ ముఖ్యంగా కరోనో తదనంతర పరిణామాల తర్వాత ల్యాప్‌టాప్‌ల వినియోగం ఎక్కువైంది. ఇక కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతోన్న సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లపై ఊహకందని డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాగ్‌షిప్‌ ఇండిపెండెన్స్‌ సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా గృహోపకరణాలు మొదలు, అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ వరకు భారీ డిస్కౌంట్‌ లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగానే ల్యాప్‌టాప్స్‌పై కూడా ఊహకందని తగ్గింపు ధరలు లభిస్తున్నాయి. ఇలాంటి ఓ బెస్ట్ ల్యాప్‌టాప్‌ డీల్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌పీ కంపెనీ చెందిన క్రోమ్‌ బుక్‌పై మంచి ఆఫర్‌ లభిస్తోంది. హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ 2024 మోడల్‌ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 25,450గా ఉండగా, ప్రస్తుతం సేల్‌లో భాగంగా 17 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 20,990కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేదు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1800 వరకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ లెక్కన ఈ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ. 19వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఇక హెచ్‌పీ క్రోముక్‌2024 ల్యాప్‌టాప్‌ ఫీచర్ల విషయానికొస్తే. ఇందులో.. మీడియాటెక్‌ ఎమ్‌టీ8183 ప్రాసెసర్‌ను అందించారు. 11.6 ఇంచెస్‌ హెచ్‌డీ ఎల్‌ఈడీ బ్యాక్‌క్లిట్‌ యాంటీ గ్లేజర్‌ డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను ఇండిగో, బ్లూ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఇక ఈ ల్యాప్‌టాప్‌ బరువు 1.7 కేజీలుగా ఉంది. ఇక ఇందులో 4జీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ కెపాసిటీని అందించనున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..