Flipkart Sale: ఆరు వేలకే 8జీబీ ర్యామ్ ఫోన్.. ఫ్లిప్ కార్ట్‌లో ఆఫర్ మిస్ కాకండి..

|

Aug 08, 2024 | 6:15 AM

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాగ్‌ షిప్‌ సేల్‌ను ప్రారంభించింది. దీనిలో అన్ని వస్తువులపై ఫ్రీడమ్‌ డీల్స్‌ను అందిస్తోంది. అతి తక్కువ ధరలోనే ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను కూడా అందిస్తోంది. వాటిల్లో స్మార్ట్‌ ఫోన్లు కూడా ఉన్నాయి. ఆ డీల్స్‌ అన్నింటిలోనూ ఆసక్తికరంగా కనిపిస్తోంది మోటోరోలా జీ సిరీస్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్‌. దీని గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

Flipkart Sale: ఆరు వేలకే 8జీబీ ర్యామ్ ఫోన్.. ఫ్లిప్ కార్ట్‌లో ఆఫర్ మిస్ కాకండి..
Motorola G04s
Follow us on

ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాగ్‌ షిప్‌ సేల్‌ను ప్రారంభించింది. దీనిలో అన్ని వస్తువులపై ఫ్రీడమ్‌ డీల్స్‌ను అందిస్తోంది. అతి తక్కువ ధరలోనే ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను కూడా అందిస్తోంది. వాటిల్లో స్మార్ట్‌ ఫోన్లు కూడా ఉన్నాయి. ఆ డీల్స్‌ అన్నింటిలోనూ ఆసక్తికరంగా కనిపిస్తోంది మోటోరోలా జీ సిరీస్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్‌. దీని గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఈ బంపర్‌ డీల్‌లో మోటోరోలా జీ 04ఎస్ ఫోన్ ని మీరు కేవలం రూ. 6,999కే కొనుగోలు చేయొచ్చు. అంతేకాక ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా లావాదేవీ చేస్తే మరో 5శాతం క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలతో పాటు అసలు మోటోరోలా జీ 04ఎస్ ఫీచర్లు ఏంటి? స్పెసిఫికేషన్లు ఏంటి? తెలుసుకుందాం రండి..

రూ. 247ఈఎంఐతో ఫోన్..

నెలకు రూ. 247తో మీరు ఈమోటోరోలా జీ04ఎస్ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ చేంజ్ ఆఫర్లో మీరు దీనిపై మరో రూ. 950 వరకూ తగ్గించవచ్చు. అయితే ఈ తగ్గింపు మీ ఎక్స్ చేంజ్ చేసే పాత ఫోన్, దాని బ్రాండ్, ఆ ఫోన్ పరిస్థితి ఆధారంగా ఉంటుంది. మొత్తం మీద దీనిని మీరు కేవలం రూ. 6,050కే కొనుగోలు చేయొచ్చు. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వార మరో 5శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందొచ్చు.

మోటోరోలా జీ04ఎస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

మోటోరోలా జీ04ఎస్ లో 720×1612 పిక్సెల్ రిజల్యూషన్ తో కూడిన 6.56 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ ప్యానెల్ ఉంటుంది. ఫోన్లో అందిస్తున్న ఈ డిస్ప్లే 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. డిస్ ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కూడాఉంటుంది. ఇది 4 జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ర్యామ్ బూస్ట్ మ్యాక్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దీంతో మరో 4జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే మొత్తం 8జీబీ వరకూ ర్యామ్ మనకు అందుబాటులో ఉంటుంది.
ఫోన్ ప్రాసెసర్ గురించి చూస్తే.. దీనిలో దీనిలో యూనిసెక్ టీ606 ప్రాసెసర్ ఉంటుంది. 1టీబీ వరకూ మైక్రో ఎస్డీ కార్డు మద్దతు ఉంటుంది. ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్ తో ఉంటుంది. సెల్ఫీ కోసం ఈ ఫోన్లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ సామర్థ్యాన్ని పరిశీలిస్తే 5000ఎంఏహెచ్ ఉంటుంది. ఇది 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం, ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఓఎస్ విషయానికొస్తే, ఆండ్రాయిడ్-14 ఆధారంగా పనిచేస్తుంది. ఆడియో కూడా డాల్బీ అట్మోస్ క్లారిటీతో వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..