క్రిప్టో కరెన్సీ కి ప్రత్యామ్నాయంగా ఓ కొత్త ఫైనాన్షియల్ సిస్టం క్రియేట్ చేయాలని నిర్ణయించుకుంది ఫేస్ బుక్ సంస్థ. ఇందుకోసం ఏడాదిగా కసరత్తు చేస్తూ వచ్చింది. మాస్టర్ కార్డ్, ఉబెర్ వంటి సంస్థలతో బాటు 27 భాగస్వామ్య కంపెనీలతో దీన్ని ప్రారంభిస్తామని, వచ్ఛే సంవత్సరం తమ పార్ట్ నర్లను 100 కి పెంచుకుంటామని ఈ సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ ప్రకటించారు. క్రిప్టో కరెన్సీ వినియోగంపై అప్పుడే అనుమానాలు తలెత్తడంతో జుకర్ బెర్గ్ తాజాగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. లిబ్రా అని కూడా వ్యవహరించే ఈ కరెన్సీకి సంబంధించి యూజర్ల ప్రయివేటు సమాచారాన్ని ఫేస్ బుక్ సరిగా ప్రొటెక్ట్ చేయడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫేస్ బుక్ తన కొత్త ప్రాజెక్టును వచ్ఛే ఏడాది నుంచి లాంచ్ చేసేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. బిట్ కాయిన్ వంటి కరెన్సీని ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ కొనుగోలుకు అనేకమంది వాడుకుంటున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఒక విధమైన నిరసనలు ప్రారంభమయ్యాయి. ఏమైనా తమ నూతన ‘ కాయిన్ ‘ విధానానికి ‘ లిబ్రా ‘ పునాది కాగలదని ఈ సంస్థ బ్లాక్ చైన్ టెక్నాలజీ హెడ్ డేవిడ్ మార్కోస్ భావిస్తున్నారు. మొత్తం వాల్డ్ లోనే ఓ గొప్ప మార్పును తీసుకువచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.యూజర్లకు మరింత బెటర్ ప్రయివసీ కల్పిస్తామని జుకర్ బెర్గ్ ఇఛ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. ఆర్ధిక సంబంధ లావాదేవీల్లో అమెరికన్ కంపెనీలతో బాటు చైనీస్ కంపెనీ టెన్సెన్ట్ డెవలప్ చేసిన ‘ వీచాట్ ‘ వంటి సంస్థలతో టచ్ లో ఉంటామని బెర్గ్ పేర్కొన్నారని ఆయన వివరించారు. పే మెంట్ సిస్టం అన్నది పారదర్శకంగా ఉండాలని అయన అన్నారు. డిజిటల్ టోకెన్స్ కు సంబంధించి ఇటీవల ఫేస్ బుక్ ప్రాజెక్టు సీక్రెట్లు కొన్ని లీక్ కావడంతో.. బిట్ కాయిన్ల విలువ తగ్గిపోయింది.