Phone Charging: ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఈ తప్పులు చేస్తే అంతే సంగతి.. ఒక్కోసారి ఫోన్ పేలిపోవచ్చు జాగ్రత్త..

|

May 03, 2022 | 5:43 PM

Phone Charging: ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వృత్తి పరమైన అవసరాలు, పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు, సరదాగా నెట్ వినియోగించే యువత వీరిలో ఎక్కువగా ఉంటున్నారు.

Phone Charging: ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఈ తప్పులు చేస్తే అంతే సంగతి.. ఒక్కోసారి ఫోన్ పేలిపోవచ్చు జాగ్రత్త..
Mobile Charging
Follow us on

Phone Charging: ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వృత్తి పరమైన అవసరాలు, పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు, సరదాగా నెట్ వినియోగించే యువత వీరిలో ఎక్కువగా ఉంటున్నారు. వినియోగం ఎక్కువగా ఉండటం కారణంగా తరచుగా ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఈ తరుణంలో మీరు స్మార్ట్‌ఫోన్ కొనడానికి షాప్ లేదా ఆన్‌లైన్ సైట్‌కి వెళ్లినప్పుడు.. అక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్(Fast Charging) అనే పదం కనిపిస్తుంటుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఇలాంటి పదం ఉపయోగించకపోయినప్పటికీ.. ఇప్పుడు ఇది బ్రాండింగ్‌లో భాగమైంది. వినియోగదారులు కోరుకుంటుంది కూడా వేగవంతమైన ఛార్జింగ్ కావాలనే. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వేగంగా ఫోన్ ఛార్జింగ్ చేసే వెసులుబాటును కంపెనీలు ప్రవేశ పెడుతూ కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు హ్యాండ్‌సెట్‌కు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని జోడించాయి. దీని కారణంగా ఫోన్‌లు వేగంగా ఛార్జ్ అవుతాయి. నేటి వేగవంతమైన ‘మెట్రో లైఫ్-స్టైల్’లో రాపిడ్ లేదా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వినియోగదారులు కోరుకుంటున్న వెసులుబాటు. ఈ సాంకేతికత ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అంతే హానికరమైనది కూడా. అందువల్ల దీనిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. వాస్తవానికి అన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయవు. ఒకవేళ చేసినా వాటికి వేర్వేరు పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు అనేక Samsung ఫోన్లలో.. 18W లేదా 25W ఛార్జింగ్ మాత్రమే అందుబాటులో ఉంది. మరోవైపు.. Realme స్మార్ట్‌ఫోన్లు మాత్రం.. 18W, 33W, 67W తో పాటు తాజాగా 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉన్న స్మార్ట్ ఫోన్లను, ఛార్జర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాయి.

Xiaomi 120W వరకు ఛార్జింగ్‌ని కూడా అందిస్తోంది. దీని వల్ల ఫోన్‌లు డెడ్ అవుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. కొన్ని సార్లు ఆన్ చేసిన వెంటనే అవి ఆఫ్ అవుతున్నాయని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. ఇటువంటి సమస్య ముఖ్యంగా గతంలో సుమారు రెండేళ్ల కిందట విడుదలైన పాత మోడళ్లలో ఎక్కువగా కనిపిస్తోందని తెలుస్తోంది. చాలా మందికి ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయడానికి ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించే అలవాటు ఉంటుంది. ప్రతి ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉండదు కాబట్టి.. సొంతంగా ఫాస్ట్ థారక ఫోన్ డెడ్ అయ్యే సందర్భాలు ఎదురవుతాయి. చాలా సార్లు వినియోగదారులు ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి టైప్-C ఛార్జింగ్‌తో కూడిన ల్యాప్‌టాప్ ఛార్జర్‌ను కూడా ఉపయోగిస్తారు. అలా చేయటం వల్ల ఫోనుకు హాని కలిగుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగా స్మార్ట్‌ఫోన్‌లు వేగంగా వేడెక్కుతాయి. ఒక్కో సారి దీని కారణంగా మదర్‌బోర్డ్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఫోన్‌ పేలిపోయే పరిస్థితి ఏర్పడ వచ్చు. అందువల్ల.. ఎల్లప్పుడూ మీరు ఫోన్ తో పాటు కంపెనీ అందించిన ఒరిజినల్ స్టాండర్డ్ ఛార్జర్‌ని ఉపయోగించడం ఉత్తమం. స్మార్ట్ ఫోన్ యూజర్లు తొందరపాటులో చేసే కొన్ని తప్పుల వల్ల ఫోన్లు పేలిపోవటం, హీట్ కావటం, డెడ్ అవ్వటం, హ్యాంగ్ అవ్వటం, సడెన్ గా స్విచ్ఛాఫ్ అవ్వటం వంటివి జరగవచ్చు.

ఇవీ చదవండి..

LIC IPO: రేపు ప్రారంభమౌతున్న అతిపెద్ద ఐపీవో.. ఎల్ఐసీ గురించి తెలుసుకోవలసిన టాప్-10 విషయాలివే..

Vivo T1 Pro 5G: వివో నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు..