Tubeless Tyres: మీ బైక్‌ తరచూ ప్యాచ్‌లు పడుతుందా? ఈ టిప్స్‌ పాటిస్తే సమస్య ఫసక్‌..

మోటర్‌ సైకిల్స్‌ వాడడం ఎంత మంచిదైనా దాని నిర్వహణ కూడా అంతే ముఖ్యమని ఆటోమొబైల్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంజిన్‌పరంగా ఎన్ని సమస్యలు ఉన్నా బైక్‌ నడవాలంటే కచ్చితంగా టైర్‌ నిర్వహణ అనేది ఉండాలి. ఇటీవల బైక్‌ ప్యాచ్‌లు పడడం అనేది సర్వసాధారణంగా మారింది. ఈ సమస్య నుంచి రక్షణ కోసం ట్యూబ్‌లెస్‌ టైర్లు ప్రత్యామ్నాయంగా మారాయి.

Tubeless Tyres: మీ బైక్‌ తరచూ ప్యాచ్‌లు పడుతుందా? ఈ టిప్స్‌ పాటిస్తే సమస్య ఫసక్‌..
Tubeless Tyre

Updated on: Aug 13, 2023 | 10:00 PM

భారతదేశంలో ద్విచక్ర వాహనాల వినియోగం భారీగా ఉంటుంది. ప్రతి ఇంటికి ఓ ద్విచక్ర వాహనం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ద్విచక్ర వాహనం ఓ వరంలా మారింది. ఎందుకంటే గతంలో ఇంటి అవసరాలకు సమీపంలోని పట్టణంలతో వెళ్లాల్సి వస్తే నరకం చూసే వారు. ఈ క్రమంలో వారు సైకిల్స్‌పై వెళ్లే వారు. క్రమేపి టెక్నాలజీ పెరగడంతో మోటర్‌సైకిల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే మోటర్‌ సైకిల్స్‌ వాడడం ఎంత మంచిదైనా దాని నిర్వహణ కూడా అంతే ముఖ్యమని ఆటోమొబైల్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంజిన్‌పరంగా ఎన్ని సమస్యలు ఉన్నా బైక్‌ నడవాలంటే కచ్చితంగా టైర్‌ నిర్వహణ అనేది ఉండాలి. ఇటీవల బైక్‌ ప్యాచ్‌లు పడడం అనేది సర్వసాధారణంగా మారింది. ఈ సమస్య నుంచి రక్షణ కోసం ట్యూబ్‌లెస్‌ టైర్లు ప్రత్యామ్నాయంగా మారాయి. అయితే కొత్తగా వచ్చే బైక్స్‌ అన్నింటికీ ఇప్పుడు ట్యూబ్‌లెస్‌ టైర్లు ఉంటున్నాయి. అయితే ఓ ఐదారేళ్ల క్రితం నుంచి తీసుకున్న బైక్స్‌కు కానీ, స్కూటర్లకు కానీ ఈ ట్యూబ్‌లైస్‌ టైర్లు లేవు. అయితే సింపుల్‌ టిప్స్‌ పాటించడం ద్వారా ట్యూబ్‌ టైర్ల నుంచి ట్యూబ్‌లెస్‌ టైర్ల కింద మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిపుణులు సూచించే టిప్స్‌ గురించి ఓ సారి తెలుసుకుందాం.

జాగ్రత్తలు ఇవే

  • బైక్‌ టైర్‌ రిమ్‌ రకం, దాని నిర్వహణకు అనుగుణంగా ట్యూబ్‌ టైర్‌ను ట్యూబ్‌ లెస్‌ టైర్‌గా మార్చుకోవచ్చు.
  • ముఖ్యంగా మీ రిమ్‌ ట్యూబ్‌ లెస్‌ టైర్‌కు అనుకూలంగా ఉన్నాయో? లేదో? తనిఖీ చేయాలి. కొన్ని రిమ్స్‌లో బీడ్‌ లాకింగ్‌ ఫీచర్‌ ఉండదు. అందువల్ల బీడ్‌ లాకింగ్‌ ఫీచర్‌ ఉన్న రిమ్స్‌ మాత్రమే ట్యూబ్‌లెస్‌ టైర్లకు అనుకూలంగా ఉంటాయి.
  • మీ బైక్‌ రిమ్‌ సైజ్‌, లోడ్‌ కెపాసిటీని బట్టి ట్యూబ్‌ లెస్‌ టైర్‌ను ఎంచుకుని, కొనుగోలు చేయాలి. మీ టైర్‌ సైడ్‌ వాల్‌ గుర్తులను తనిఖీ చేసి ట్యూబ్‌లెస్‌ టైర్‌ను ఎంచుకోవాలి.
  • మీ బైక్‌ రిమ్‌ సైజ్‌, వాల్వ్‌ హోల్‌ సైజ్‌కు అనుకూలంగా ఉండేలా ట్యూబ్‌లెస్‌ వాల్వ్‌ స్టెమ్‌ను కొనుగోలు చేయాలి.
  • ముఖ్యంగా ట్యూబ్‌లెస్‌ టైర్‌ను అమర్చే సమయంలో రిమ్‌ను పూర్తి స్థాయిలో శుభ్రం చేశారో? లేదో? సరి చూసుకోవాలి.
  • ట్యూబ్‌లెస్‌ వాల్వ్‌ స్టెమ్‌ను అమర్చే సమయంలో, లాక్‌ నట్‌ను బిగించే సమయంలో సరి చూసుకోవాలి.
  • ట్యూబ్‌లెస్‌ టైర్‌ అమర్చాక గాలి లీకేజీలు ఉన్నాయో? లేదో? సరి చూసుకోవాలి.
  • హ్యాండ్లింగ్‌, పనితీరు సమస్యలను తనిఖీ చేయడానికి తక్కువ వేగంతో బైక్‌ను నడిపి తనిఖీ చేసుకోవడం ఉత్తమం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం