App Reduce BP: యాప్‌తో తగ్గుతున్న బీపీ.. మూడేళ్ల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి..

|

Oct 24, 2021 | 5:57 AM

App Reduce BP: దినదినాభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ.. రోజుకో కొత్త పుంతలు తొక్కుతుంది. మారుతున్న కాలం.. వ్యక్తుల ఆరోగ్యం పట్ల తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో..

App Reduce BP: యాప్‌తో తగ్గుతున్న బీపీ.. మూడేళ్ల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి..
App
Follow us on

App Reduce BP: దినదినాభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ.. రోజుకో కొత్త పుంతలు తొక్కుతుంది. మారుతున్న కాలం.. వ్యక్తుల ఆరోగ్యం పట్ల తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే స్థితిలో కూడా జనాలు ఉండటం లేదు. ఈ క్రమంలో వ్యక్తుల ఆరోగ్య స్థితిని మానిటరింగ్ చేసేందుకు రకరకాల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. యాప్స్, స్మార్ట్స్ ఫోన్ ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం, స్మార్ట్ వాచ్‌లు మన ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే మనిషి ఆరోగ్యాన్ని కాపాడేందుకు తాజాగా మరో కొత్త యాప్ మార్కెట్‌లోకి వచ్చింది. ఇది ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతాం.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో జనాలు ఎప్పుడు తింటున్నారు.. ఎప్పుడు నిద్రపోతున్నారనే విషయమే తెలియకుండా పోతోంది. ఫలితంగా అనేక రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ పెరగడం, షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం బారిన పడటం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిపుణులు టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త యాప్‌ను కనిపెట్టారు. ఈ యాప్ సాయంతో వ్యక్తుల్లో బీపీని తగ్గించేస్తున్నారు. ‘‘హలో హార్డ్’’ పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా వ్యక్తుల అనారోగ్య సమస్యలను ట్రాక్ చేయడం, వారికి అవసరమైన సూచనలు జారీ చేయడం వంటివి చేస్తుంటుంది. ఈ ఫ్రోగ్రామ్‌తో ముఖ్యంగా స్టేజ్ 2 హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తులు 85 శాతం మందికి ఏడాదిలోగా సిస్టోలిక్ ప్రెజర్ తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ యాప్ ను దాదాపు 28 వేల మందిపై మూడేళ్లుగా అధ్యయనం జరుపుతున్నామని, మూడేళ్ల కాలంలో వారిలో బీపీ గణనీయంగా తగ్గినట్లు అధ్యయనం చేసిన పరిశోధకులు తెలిపారు. అంతేకాదు.. ఈ ‘‘హల్లో హార్డ్’’ యాప్ ద్వారా వ్యక్తుల బీపీ, బరువు, ఫిజికల్ యాక్టివిటీ వంటి వాటిని ట్రాక్ చేస్తుందని, ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే అలర్ట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Also read:

Migraine Relief Tips: మైగ్రేన్‌‌తో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే ఇలా ఉపశమనం పొందండి..

Nivetha Thomas: వావ్.. అరుదైన ఫీట్ సాధించిన నేచురల్ బ్యూటీ నివేదా థామస్.. కష్టానికి సలామ్ కొట్టాల్సిందే..!

Viral News: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో రికార్డు సేల్స్‌.. రూ. 14 వేల కోట్లు విలువ చేసే వస్తువుల్ని ఒక్కడే అదీ గంటలో అమ్మేశాడు!