AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel Xtream: పాత టీవీను నయా ఆండ్రాయిడ్‌ టీవీగా మార్చాలా? ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌తో సాధ్యం

ఎయిర్‌టెల్‌ అందించే డీటీహెచ్‌ సర్వీసులతో పాత డబ్బా టీవీను కూడా ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకుని మనకు నచ్చిన చానెల్‌ను ఆశ్వాదించవచ్చు. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ డీటీహెచ్‌ (డైరెక్ట్-టు-హోమ్) విభాగం వినియోగదారులకు ఆండ్రాయిడ్‌ టీవీ బాక్స్‌ను అందిస్తుంది. దీన్ని ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌గా పేర్కొంటున్నారు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సేవలు చాలా కాలంగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Airtel Xtream: పాత టీవీను నయా ఆండ్రాయిడ్‌ టీవీగా మార్చాలా? ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌తో సాధ్యం
Airtel Xtreme
Nikhil
| Edited By: |

Updated on: Oct 28, 2023 | 9:50 PM

Share

ప్రస్తుతకాలంలో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో స్మార్ట్‌ పరికరాల హవా నడుస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో టీవీల్లో ఆండ్రాయిడ్‌ టీవీలు ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. నెట్‌ సదుపాయం పెరిగడం వల్ల  ఫోన్‌ను టీవీకు కనెక్ట్‌ చేయాలంటే మాత్రం కచ్చితంగా ఆ టీవీ ఆండ్రాయిడ్‌కు సపోర్ట్‌ చేయాలి. అయితే ప్రస్తుతం చాలా మంది ఇళ్లల్లో పాత టీవీలే ఉన్నాయి. అందువల్ల కేబుల్‌ ప్రసారాలను మాత్రమే వీక్షిస్తున్నారు. అయితే ఎయిర్‌టెల్‌ అందించే డీటీహెచ్‌ సర్వీసులతో పాత డబ్బా టీవీను కూడా ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకుని మనకు నచ్చిన చానెల్‌ను ఆశ్వాదించవచ్చు. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ డీటీహెచ్‌ (డైరెక్ట్-టు-హోమ్) విభాగం వినియోగదారులకు ఆండ్రాయిడ్‌ టీవీ బాక్స్‌ను అందిస్తుంది. దీన్ని ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌గా పేర్కొంటున్నారు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సేవలు చాలా కాలంగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మీకు పాత టీవీ ఉంటే ఎయిర్‌టెల్ ఆండ్రాయిడ్ బాక్స్ సహాయంతో మీరు దానిని స్మార్ట్ టీవీగా మార్చవచ్చు. అంతేకాకుండా మీకు ఇష్టమైన ఓటీటీ షోలను చూడటానికి అలాగే యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో నేరుగా మీ టీవీలో యాప్‌లకు యాక్సెస్‌ను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ఎయిర్‌టెల్ నుండి ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌ ధర

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధర రూ.1500 మాత్రమే. చూడడానికి ప్రీమియం బాక్స్‌లా కనిపించే ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌ అందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్ నుంచి నేరుగా ఆర్డర్ చేయవచ్చు లేదా సమీపంలోని స్టోర్‌ ద్వారా ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సేవలను పొందవచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సేవలు దాదాపు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ బ్లాక్‌తో ఒక బండిల్ సర్వీస్‌గా కూడా కొనుగోలు చేయవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్పెసిఫికేషన్‌లు

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లాంటిది. ఈ బాక్స్‌ ద్వారా మీరు ఆండ్రాయిడ్‌ టీవీ ప్లాట్‌ఫారమ్ కోసం అందుబాటులో ఉన్న 5,000 కంటే ఎక్కువ యాప్‌లకు యాక్సెస్ పొందుతారు. అలాగే మీకు కావాల్సినప్పుడు మీరు లీనియర్ టీవీ కంటెంట్‌కి మారవచ్చు. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌కాస్ట్ ఫీచర్‌ను ఉపయోగించాలనుకుంటే ఎయిర్‌టెల్ నుంచి ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్ అంతర్నిర్మిత క్రోమ్‌కాస్ట్‌తో వస్తుంది. అలాగే గూగుల్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌ కూడా ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌ ప్రత్యేకతలు. ఈ ఎయిర్‌టెల్‌బాక్స్ ప్యాకేజింగ్‌లో ఆండ్రాయిడ్‌ టీవీ 9.0 ప్లాట్‌ఫారమ్‌లో రన్ అవుతుంది . అలాగే ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌తో మీరు కంటెంట్‌ను 4కే నాణ్యతలో వీక్షించవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

Follow Us
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఓటీటీలో సత్తా చాటుతున్న చిన్న సినిమా..
ఓటీటీలో సత్తా చాటుతున్న చిన్న సినిమా..
వర్క్ ప్రెజర్‌ నిజంగానే సంతానోత్పత్తిని తగ్గిస్తోందా?..
వర్క్ ప్రెజర్‌ నిజంగానే సంతానోత్పత్తిని తగ్గిస్తోందా?..