AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3: పని మొదలుపెట్టిన చంద్రయాన్‌-3.. చంద్రుడి ఉపరితలం ఫొటోలను పంపిన స్పేస్‌ క్రాఫ్ట్‌.

ఇస్రో జులై 14న చంద్రయాన్ 3 ప్రయోగం ప్రారంభించిన విషయం విధితమే. ఆ తర్వాత కక్ష్యను పెంచుకొని, ఈ ఆగస్టు 1వ తేదీన చంద్రుడిని చేరే లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది. అనంతరం శనివారం రాత్రి 7 గంటల సమయంలో జాబిల్లికి చేరువగా ఉండే బిందువులోకి ప్రవేశించింది. లూనర్ ఆర్బిట్ ఇనసర్షన్ పక్రియను విజయవంతంగా చేపట్టామని, చంద్రయాన్‌-3 మొదటిదశ కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 6 వ తేదీ 11గంటలకు నిర్వహించారు. ఇలా కక్ష్యను తగ్గిస్తూ ఈ నెల 17  తర్వాత వ్యోమనౌకను...

Chandrayaan 3: పని మొదలుపెట్టిన చంద్రయాన్‌-3.. చంద్రుడి ఉపరితలం ఫొటోలను పంపిన స్పేస్‌ క్రాఫ్ట్‌.
Chandrayaan 3
Narender Vaitla
| Edited By: |

Updated on: Aug 21, 2023 | 12:34 PM

Share

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 3 ప్రయోగం సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. చంద్రుడిపై కాలుమోపడమే లక్ష్యంగా రోదసిలో పయనిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 అనుకున్న లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది.ఇప్పటికే చంద్రుడికి అతి చేరువలోకి వెళ్లిన స్పేస్‌ క్రాఫ్ట్‌ తాజాగా ఒక వీడియోను రికార్డు చేసి పంపింది. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ఈ వీడియోను ఇస్రో విడుదల చేసింది. ఈ చిత్రాల్లో చందమామ చాలా దగ్గరగా కనిపిస్తుండటం విశేషం. చందమామపై లోయలు, పర్వతాలు, గ్రహశకలాల దాడుల దృశ్యాలను ఈ చిత్రాల్లో చూడొచ్చు. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించినప్పుడు చందమామ ఇలా కనిపిస్తోందంటూ ట్విట్టర్‌లో వీడియో షేర్‌ చేసింది ఇస్రో.

ఇస్రో జులై 14న చంద్రయాన్ 3 ప్రయోగం ప్రారంభించిన విషయం విధితమే. ఆ తర్వాత కక్ష్యను పెంచుకొని, ఈ ఆగస్టు 1వ తేదీన చంద్రుడిని చేరే లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది. అనంతరం శనివారం రాత్రి 7 గంటల సమయంలో జాబిల్లికి చేరువగా ఉండే బిందువులోకి ప్రవేశించింది. లూనర్ ఆర్బిట్ ఇనసర్షన్ పక్రియను విజయవంతంగా చేపట్టామని, చంద్రయాన్‌-3 మొదటిదశ కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 6 వ తేదీ 11గంటలకు నిర్వహించారు. ఇలా కక్ష్యను తగ్గిస్తూ ఈ నెల 17  తర్వాత వ్యోమనౌకను చంద్రుడికి చేరువ చేస్తారు. అనంతరం వ్యోమనౌకను చంద్రుడికి 100 కి.మీల ఎత్తులోకి తీసుకళ్తారు. తదనంతరం ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్ ను ల్యాండ్ చేస్తారు.

Isro

ఇవి కూడా చదవండి

ఇలా జాబిల్లికి నెమ్మదిగా చేరువవుతోంది చంద్రయాన్‌ 3. ఇక చంద్రుడికి సంబంధించి చంద్రయాన్‌–3 పంపించిన తొలి వీడియో ఇదే. ఈ క్రమంలోనే చంద్రుడికి మరింత చేరువ చేసే దిశగా శాస్త్రవేత్తలు ఆదివారం రాత్రి వ్యోమనౌకిలోని ఇంజన్‌ను మండించి కక్ష్యను కుదించారు. ఇక చంద్రయాన్‌-3ని చంద్రుడికి మరింత దగ్గర చేసే దిశగా ఈ నెల 9న మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 9న మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. చివరిలో చంద్రుడికి 100 కి.మీలో ఎత్తున ఉన్న దీర్ఘవృత్తకార కక్ష్యలోకి చంద్రయాన్‌3ని ప్రవేశపెట్టనున్నారు. ఇక 23వ తేదీన జాబిల్లిపై ల్యాండ్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే చంద్రయాన్ 3 చంద్రుడి చుట్టూ మొదటి రౌండ్ ను పూర్తి చేసింది. మరో ఐదు రౌండ్లు పూర్తి చేసిన తర్వాత ల్యాండ్ కానున్న ల్యాండర్. చంద్రుడికి దగ్గరగా 170 కి.మీ, దూరంగా 4313 కి.మీ దూరంలో చంద్రయాన్ 3 ఉంది.

మరిన్ని సైన్స్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నెహ్రూ జూపార్క్‌కు వెళుతున్నారా..? టికెట్ల ధరలు పెరిగాయ్..
నెహ్రూ జూపార్క్‌కు వెళుతున్నారా..? టికెట్ల ధరలు పెరిగాయ్..
ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు 2026: శ్రావణ మాస విశేషాలతో పూర్తి..
ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు 2026: శ్రావణ మాస విశేషాలతో పూర్తి..
నాటు కోడి స్టైల్‌లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు
నాటు కోడి స్టైల్‌లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు
విజయ్ దళపతి కొడుకు ఫస్ట్ రియాక్షన్.. ఆకట్టుకుంటున్న మాటలు..
విజయ్ దళపతి కొడుకు ఫస్ట్ రియాక్షన్.. ఆకట్టుకుంటున్న మాటలు..
భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? - జిడ్డు కృష్ణమూర్తి
భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? - జిడ్డు కృష్ణమూర్తి
రూ.లక్ష పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా
రూ.లక్ష పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా
916 రేటింగ్ పాయింట్లతో చరిత్ర.. టీ20ల్లో ఈషాన్ కొత్త రికార్డ్
916 రేటింగ్ పాయింట్లతో చరిత్ర.. టీ20ల్లో ఈషాన్ కొత్త రికార్డ్
హైదరాబాద్‌వాసులకు శుభవార్త.. ఇది కదా కావాల్సింది..
హైదరాబాద్‌వాసులకు శుభవార్త.. ఇది కదా కావాల్సింది..
చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి..
చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి..