Car Safety: మీరు కొత్త కారు కొంటున్నారా..? ఈ ఐదు ముఖ్యమైన ఫీచర్స్‌ ఉండాల్సిందే.. వీటి ఉపయోగమేంటో తెలుసుకోండి

|

May 15, 2022 | 1:37 PM

Car Safety Features: మనం కారు కొనాలని అనుకున్నప్పుడు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డ్రైవింగ్‌ వచ్చి ఉండాలి. అలాగే కారుకు సంబంధించి అన్ని విషయాలు ..

Car Safety: మీరు కొత్త కారు కొంటున్నారా..? ఈ ఐదు ముఖ్యమైన ఫీచర్స్‌ ఉండాల్సిందే.. వీటి ఉపయోగమేంటో తెలుసుకోండి
Car Safety Features
Follow us on

Car Safety Features: మనం కారు కొనాలని అనుకున్నప్పుడు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డ్రైవింగ్‌ వచ్చి ఉండాలి. అలాగే కారుకు సంబంధించి అన్ని విషయాలు తెలిసి ఉండాలి. కారు కొనేందుకే లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం. ఏ కారు (Car) కొనుగోలు చేసినా.. మంచి సేఫ్టి ఫీచర్స్‌ ఉండాలి. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కారు కొనుగోలు చేసే ముందు ఎలాంటి ఫీచర్స్‌ ఉన్నాయి.. ఎలాంటివి లేవు అనే విషయాలను తెలుసుకోవాలి. అందుకే కారులో సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. కారులో ఏయే సేఫ్టీ ఫీచర్లు అవసరం అనే పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాము.

  1. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు: కారులో ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి. ఎయిర్‌బ్యాగ్‌లు ప్రమాద సమయంలో డ్రైవర్‌ను, కో-డైవర్‌ గాయపడకుండా కాపాడతాయి. డ్యూయల్‌ ఎయిర్‌ బ్యాగు వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
  2. సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్: సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ప్రయాణికుడు రక్షణగా ఉంటుంది. సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్ అవసరం. అకస్మాత్తుగా బ్రేక్‌లు వేసినప్పుడు కూర్చున్న వ్యక్తి ముందుకు కదలకుండా చేస్తుంది.
  3. స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్: చాలా సార్లు మనం కారులో కూర్చున్న తర్వాత లాక్ చేయడం మర్చిపోతాం. కాబట్టి స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ సిస్టమ్‌ ఎంతో మేలు. కారు ఒక నిర్దిష్ట వేగానికి చేరుకున్నప్పుడు, డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ చేయబడతాయి.
  4. రివర్స్ పార్కింగ్ సెన్సార్: మనం కారును చాలా తక్కువ స్థలంలో పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు రివర్స్ పార్కింగ్ సెన్సార్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కారు పార్క్ చేస్తున్నప్పుడు కారు వెనుక ఏదైనా జరిగితే అది డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. ఇలా పార్కింగ్‌ సెన్సార్‌ ఉండటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ABS-EBD (Anti-lock Braking System with Electronic Brake-force Distribution System): ఇది ఏ కారుకైనా అవసరమైన బ్రేకింగ్ ఫీచర్. భారతదేశంలో విక్రయించే చాలా కార్లలో ఇది లేదు. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే ABS కారు అకస్మాత్తుగా బ్రేక్ చేసినప్పుడు కారు చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధిస్తుంది. తద్వారా కారు అదుపులో ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి