స్మార్ట్ వాచ్.. ఇటీవల కాలంలో ట్రెండీ వస్తువు. వాస్తవానికి స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాచ్ ల వినియోగం గణనీయంగా తగ్గింది. అయితే టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతుండటంతో అనలాగ్ వాచ్ ల స్థానంలో డిజిటల్ వాచ్ లు వచ్చాయి. ఇప్పుడు వాటి స్థానంలో స్మార్ట్ వాచ్ లు మరింత స్మార్ట్ గా వినియోగదారులకు కొత్త అనుభూతినిస్తున్నాయి. కంపెనీలు కూడా విరివిరిగా స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్ ల ధర ఆకాశన్నంటుతున్నాయి. ఫలితంగా సామాన్యులు వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే మన దేశంలో బడ్జెట్ కు అనుగుణంగా ఫైర్ బోల్ట్ కంపెనీ యాపిల్ లేటెస్ట్ మోడల్ అల్ట్రా ను పోలి ఉండేలా ఓ మోడల్ లాంచ్ చేస్తోంది. దీని స్పెసిఫికేషన్లు, ధర, ఫీచర్లు వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
యాపిల్ సంస్థ తన అడ్వాన్స్ డ్ స్మార్ట్ ఫోన్ యాపిల్ వాచ్ అల్ట్రా ను 2022 అక్టోబర్ లో లాంచ్ చేసింది. ఇది ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న అన్ని స్మార్ట్ వాచ్ లకన్నా ధృడమైన, అధిక సామర్థ్యం కలిగిన వాచ్ గా ఆ సంస్థ ప్రకటించుకుంది. ప్రధానంగా అథ్లెట్లు, సాహసయాత్రలు చేసే వారి అవసరాలకు అనుగుణంగా ఈ వాచ్ లో అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉంచారు. అయితే దీని ధర మన దేశంలో రూ. 89,900గా నిర్ధారించారు. ఇంత ధర పెట్టి మన దేశంలో సామాన్యులు కొనలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన స్మార్ట్ వాచ్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ తన కొత్త ప్రాడెక్ట్ ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ ను అమెజాన్ లో విడుదల చేసింది. ఇది డిసెంబర్ 30 నుంచి కొనుగోలు దారులకు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. దీన ధర రూ. 2,499 ఉన్నట్లు సమాచారం. అయితే దీనిని ఆ కంపెనీ ధ్రువీకరించలేదు. అయితే రూ. 3000 లోపు ధర ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
అమెజాన్ లో పొందుపరిచిన విధంగా ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ 1.96-inch డిస్ ప్లే ఉంటుంది. ఇది యాపిల్ అల్ట్రా వాచ్ కన్నా పెద్దది. అలాగే 600 NITS పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. ఫ్రేమ్ డిజైన్ కూడా అల్ట్రా వాచ్ కు దగ్గర ఉంటుంది. దీనిలో బ్యాటరీ సాధారణంగా ఏడు రోజుల పాటు వస్తుందని ఆ కంపెనీ ప్రకటించుకుంది. అదే బ్లూటూత్ ఆన్ చేసి పెడితే రెండు రోజుల పాటు ఉంటుంది. స్టాడ్ బై మోడ్ లో ఉంచితే దాదాపు 20 రోజుల బ్యాటరీ ఉంటుందని వివరించింది. అలాగే క్రాక్, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ లో ఐపీ67 రేటింగ్ ఈ వాచ్ కి ఉంది.
అమెజాన్ లో స్ట్రీమ్ అవుతున్న టీజర్ ప్రకారం ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ లో దాదాపు 123 స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. రన్నింగ్, కాలరీ ట్రాకింగ్, హార్ట్ మోనటరింగ్ వంటి పీచర్లు ఉన్నాయి. అలాగే జీపీఎస్ ట్రాకింగ్ అందుబాటులో ఉంది. పలు ఇన్ బిల్ట్ గేమ్స్ కూడా ఉన్నాయి.
యాపిల్ అల్ట్రా స్మార్ట్ వాచ్ అథ్లెట్లు, సాహస యాత్రికులను టార్గెట్ చేసి విక్రయాలు జరుపుతుండగా.. బోల్ట్ గ్లాడియేటర్ అతి తక్కువ బడ్జెట్ లో అత్యాధునిక ఫీచర్లు కావాలనుకునే వారిని టార్గెట్ చేయనుంది. ఇది కూడా యాపిల్ లుక్ లో ఉండటంతో కొనుగోలు దారులు ఆసక్తి చూపే అవకాశం ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..