BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లకు దీపావళి బొనాంజా.. అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్స్‌

|

Nov 03, 2023 | 8:26 AM

భారత ప్రభుత్వానికి చెందిన ఈ టెలికం సంస్థ దీపావళి కానుకగా యూజర్ల కోసం ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డేటాకు ప్రాధాన్యతనిస్తూ కొన్ని రీఛార్జ్‌ ప్లాన్స్‌ను కొత్తగా పరిచయం చేసింది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఇంతకీ బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఏంటి.? వాటి బెనిఫిట్స్‌ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లకు దీపావళి బొనాంజా.. అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్స్‌
BSNL
Follow us on

మీరు బీఎస్‌ఎన్ఎల్‌ నెట్‌ వర్క్‌ని ఉపయోగిస్తున్నారా.? అయితే మీకు గుడ్‌ న్యూస్‌. భారత ప్రభుత్వానికి చెందిన ఈ టెలికం సంస్థ దీపావళి కానుకగా యూజర్ల కోసం ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డేటాకు ప్రాధాన్యతనిస్తూ కొన్ని రీఛార్జ్‌ ప్లాన్స్‌ను కొత్తగా పరిచయం చేసింది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఇంతకీ బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఏంటి.? వాటి బెనిఫిట్స్‌ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న రీఛార్జ్‌ ప్లాన్స్‌లో రూ. 251 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 70 జీబీ డేటా లభిస్తుంది. అయితే దీనిద్వారా ఎలాంటి కాలింగ్‌, ఎస్‌ఎమ్‌ఎస్ బెనిఫిట్స్‌ ఉండవు. కేవలం డేటా కోసంమాత్రమే. బీఎస్‌ఎనల్‌ మొబైల్ యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకుంటే అదనంగా 3 జీబీ డేటాను పొందొచ్చు.

* ఇక దీపావళి కానుకగా బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 666తో మరో రీఛార్జ్‌ ప్లాన్‌ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 105 రోజులు వ్యాలిడీటి లభిస్తుంది. అన్‌లిమిటిడ్‌ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా పొందొచ్చు. అయితే ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఎలాంటి డేటా లభించదు, కానీ BSNL సెల్ఫ్‌ కేర్‌ యాప్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అదనం 3 జీబీ డేటా పొందొచ్చు.

* బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న మరో బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్స్‌లో రూ. 599 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ లోకల్‌ కాల్స్‌, ఎస్‌టీడీ కాల్స్‌ పొందొచ్చు. అలాగే రోజుకు 3 జీబీ డేటాను పొందొచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. ఇక యాప్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అదనంగా 3జీబీ డేటా పొందొచ్చు. ఇక ఈ రీఛార్జ్‌తో అదనంగా జింగ్‌, పీఆర్‌బీటీ, ఆస్ట్రోటెల్‌, గేమ్‌ ఆన్‌ సర్వీస్‌ పొందొచ్చు. ఇక ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ నైట్‌ డేటాను సైతం పొందొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..