
పోకో ఎక్స్ 4 ప్రో ఈ ఫోన్ రూ.17,899కు అందుబాటులో ఉంటుంది. మంచి కెమెరాతోపాటు స్టైలిష్ డిజైన్‌తో చూడడానికి రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్‌లా ఉంటుంది. ముఖ్యంగా 108 ఎంపీ కెమెరా ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణ

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 33 రూ.15,999కు అందుబాటులో ఉండే ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. చార్జింగ్ సమస్యలను దూరం చేసే ఈ ఫోన్ శామ్‌సంగ్ ఫోన్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ కెమెరాతో పాటు అదనపు ఫీచర్లతో అందుబాటులో ఉండే ఈ ఫోన్ వన్ ప్లస్ ఫోన్ లవర్స్‌కు ఓ మంచి ఎంపిక. ఈ ఫోన్ రూ.18,999కు అందుబాటులో ఉంటుంది.

మోటోరోలా జీ 72 రూ.15,999కు అందుబాటులో ఈ సూపర్ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్‌తో వస్తుంది. సింపుల్ యూఐ అనుభూతితో స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను ఈ ఫోన్ కట్టి పడేస్తుంది.

రియల్ మి 10 ప్రో ప్రీమియం డిజైన్, సూపర్ స్పీడ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. సూపర్ కెమెరాతో పాటు అధిక రిజుల్యూషన్ ఈ ఫోన్ సొంతం. దీని ధర రూ.18,999గా ఉంది.

రెడ్‌మీ నోట్ 12 5 జీ కనెక్టవిటీతో వచ్చే ఈ ఫోన్ ఎమోఎల్ఈడీ డిస్ ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. సూపర్ డిజైన్‌తో పాటు అత్యాధునిక ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ ధర మాత్రం రూ.19,999.

రియల్‌మీ 9 ఎస్ఈ స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ గేమింగ్ లవర్స్‌కు పరెఫెక్ట్ ఫోన్. అంతే కాకుండా ఈ ఫోన్ ధర కూడా రూ.17,899గా ఉండడంతో యువత ఎక్కువగా ఈ ఫోన్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

రియల్ మీ 9 ప్రో ధీర్ఘకాల బ్యాటరీతోపాటు ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్‌ను యువతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ధర కూడా రూ.18,720గా ఉండడంతో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

ఒప్పో కే 10 5జీ ఆకర్షనీయమైన డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 810 ఎస్ఓసీతో వస్తుంది. అధిక రిఫ్రెష్ రేట్‌తో సాలిడ్ పెర్ఫార్మర్‌గా ఉండే ఈ ఫోన్ ధర మాత్రం రూ.16,999గా ఉంది.

ఒప్పో ఎఫ్ 19 ప్రో ప్లస్ ఈ ఫోన్ చూడడానికి రియల్ మీ నార్జో 30 ప్రోకు క్లోనింగ్‌లా ఉంటుంది. ఈ రెండు ఫోన్‌లు ఒకే ఎస్ఓసీ, ర్యామ్‌లను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ ధర కూడా రూ.19,990గా ఉంది.