Asus ల్యాప్​టాప్‌లపై దీపావళికి భారీ ఆఫర్లు ప్రకటించిన Amazon, Flipkart.. డిస్కౌంట్​ ఎంతంటే

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రముఖ టెక్నాలజీ సంస్థ ASUS తన ల్యాప్‌టాప్‌లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. Amazon, Flipkart ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉండే ఈ దీపావళి ఆఫర్లు Zenbook, Vivobook, ROG, TUF Gaming, ExpertBook సిరీస్‌లకు వర్తిస్తాయి. ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌ మోడళ్లపై 50 శాతానికి పైగా డిస్కౌంట్లు అందిస్తోంది. కొత్త ల్యాప్‌టాప్‌ కొనాలనుకునే వారికి ఈ ఆఫర్లు మంచి అవకాశంగా చెప్పవచ్చు. విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులు, గేమింగ్ ప్రియులు తమ అవసరాలకు అనుగుణంగా మోడళ్లను ఎంచుకోవచ్చు.

Asus ల్యాప్​టాప్‌లపై దీపావళికి భారీ ఆఫర్లు ప్రకటించిన Amazon, Flipkart.. డిస్కౌంట్​ ఎంతంటే
Asus Diwali Sale 2026 In India

Updated on: Nov 07, 2026 | 8:10 PM

డిస్కౌంట్లతో పాటు కొనుగోలుదారులకు మరిన్ని ప్రయోజనాలను కూడా ASUS అందిస్తోంది. నో-కాస్ట్ EMI సదుపాయాన్ని గరిష్ఠంగా 24 నెలల వరకు పొందవచ్చు. పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రీమియం బిజినెస్ ల్యాప్‌టాప్‌లైన ExpertBook Ultra, P సిరీస్ మోడళ్లు Flipkartలో అందుబాటులో ఉన్నాయి. గేమింగ్, ప్రొఫెషనల్ వర్క్, రోజువారీ అవసరాల కోసం ల్యాప్‌టాప్‌ కొనాలనుకునే వారికి ఈ సేల్‌లో పలు ధరల శ్రేణుల్లో మోడళ్లు లభిస్తున్నాయి.

ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు

Amazonలో ASUS Zenbook S14 (16GB/512GB/Intel Graphics) ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ.3,02,990 కాగా, దీపావళి ఆఫర్‌లో రూ.1,69,990కే లభిస్తోంది. మరో Zenbook S14 Intel Core Ultra 7 355 Series 3 మోడల్‌ రూ.1,67,990కు అందుబాటులో ఉంది. Zenbook A16 Snapdragon X2 Elite Extreme ధర రూ.2,04,990గా ఉంది. ఇక గేమింగ్ విభాగంలో ROG Zephyrus G14 Intel Core Ultra 9 (16GB/1TB) మోడల్‌ రూ.3,39,990కు లభిస్తోంది. ROG Zephyrus Duo 16 మోడళ్ల ధరలు రూ.5,69,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. ROG Strix, ProArt సిరీస్‌లలోనూ పలు మోడళ్లపై తగ్గింపులు ఉన్నాయి.

Flipkartలో ASUS TUF Gaming A15 AMD Ryzen 7 (16GB/512GB) ల్యాప్‌టాప్‌ రూ.92,990కు లభిస్తోంది. దీని అసలు ధర రూ.1,61,990. TUF Gaming F16 Intel Core 5 Processor 205H (16GB/512GB) మోడల్‌ రూ.1,04,990కు అందుబాటులో ఉంది. TUF Gaming A14 ధర రూ.2,34,990గా ఉంది. ROG Strix G16 AMD Ryzen 9 మోడల్‌ రూ.2,79,990కు కొనుగోలు చేయవచ్చు.

Vivobook, ExpertBook ల్యాప్‌టాప్‌ల ధరలు ఇవే

రోజువారీ వినియోగం, ఆఫీస్ పనుల కోసం Vivobook సిరీస్‌లోనూ పలు ఆఫర్లు ఉన్నాయి. ASUS Vivobook 15 Intel Core 3 మోడల్‌ రూ.52,990కు లభిస్తోంది. Vivobook 15 Intel Core 5 (16GB/512GB) ధర రూ.66,990గా ఉంది. Vivobook 16 AMD Ryzen 7 7840HS మోడల్‌ రూ.69,990కు, Vivobook S16 Snapdragon X మోడల్‌ రూ.80,990కు అందుబాటులో ఉన్నాయి.

బిజినెస్ వినియోగదారుల కోసం ExpertBook P1 సిరీస్‌లో కొన్ని మోడళ్ల ధరలు రూ.50,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. ExpertBook P3 సిరీస్ మోడళ్లు రూ.86,990 నుంచి లభిస్తుండగా, P5 సిరీస్ ధరలు రూ.96,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రీమియం ExpertBook Ultra సిరీస్‌లో కొన్ని మోడళ్ల ధరలు రూ.1,79,990 నుంచి ఉన్నాయి. అయితే అన్ని మోడళ్లపై ఒకే స్థాయిలో తగ్గింపు లేదు. కొనుగోలు చేసే ముందు Amazon, Flipkartలో మోడల్‌ వారీగా ధరలు, అందుబాటులో ఉన్న ఆఫర్లు, EMI, ఎక్స్‌ఛేంజ్‌ నిబంధనలు పరిశీలించడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us