Phonepe: పోయిన మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఫోన్‌పే సేవలను ఎలా బ్లాక్‌ చేసుకోవాలో తెలుసా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే సరి..

| Edited By: Narender Vaitla

Jul 19, 2021 | 5:44 AM

Phonepe Account Block: ప్రస్తుతం డిజిటల్‌ వ్యాలెట్ల హవా నడుస్తోంది. చిన్న లావాదేవీల నుంచి పెద్ద వాటి వరకు అందరూ యూపీఐ పేమెంట్స్‌ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. క్షణాల్లో డబ్బులు బదిలీ కావడం ఎక్కడికి పడితే అక్కడికి డబ్బులు...

Phonepe: పోయిన మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఫోన్‌పే సేవలను ఎలా బ్లాక్‌ చేసుకోవాలో తెలుసా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే సరి..
Phonepe Account
Follow us on

Phonepe Account Block: ప్రస్తుతం డిజిటల్‌ వ్యాలెట్ల హవా నడుస్తోంది. చిన్న లావాదేవీల నుంచి పెద్ద వాటి వరకు అందరూ యూపీఐ పేమెంట్స్‌ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. క్షణాల్లో డబ్బులు బదిలీ కావడం ఎక్కడికి పడితే అక్కడికి డబ్బులు క్యారీ చేయాల్సిన అవసరం లేకపోవడంతో యూజర్లు పెద్ద ఎత్తున వీటిని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల ఫోన్‌పే సేవలను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. అయితే మొబైల్‌ మన దగ్గర ఉంటే ఫోన్‌పే సేవలను బ్లాక్‌ చేసుకోవడం చాలా సులభమైన పని. మరి అలా కాకుండా ఒకవేళ మీ ఫోన్‌ పోతే.. అది ఇతరుల చేతుల్లోకి చేరితో యాప్‌ దుర్వినియోగం అవుతందనే అనుమానం ఉంటుంది. మరి పోయి మీ ఫోన్‌లో ఉన్న ఫోన్‌ పేను ఎలా బ్లాక్‌ చేసుకోవాలో ఓసారి తెలుసుకుందామా..!

ఇందుకోసం ఫోన్‌పే యూజర్లు ముందుగా 08068727374 లేదా 02268727374 టోల్‌ ఫ్రీ నెంబర్లకు ఫోన్‌ చేయాలి. అనంతరం మీరు కోరుకునే భాషను ఎంచుకోవాలి. తర్వాత.. ‘ఫోన్‌ పే అకౌంట్‌తో సమస్యను నిదేదించాలనుకున్నారా’ అన్న ప్రశ్నకు సంబంధించి అడిగిన నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత వెంటనే మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి. మీ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. అయితే అప్పటికే మీ ఫోన్‌ మీ దగ్గర ఉండదు కాబట్టి.. ఓటీపీ రాదని ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత సిమ్‌ కార్డు పోయిందని వచ్చే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో కస్టమర్‌ కేర్‌ ప్రతినిధికి కాల్ కనెన్ట్ అవుతుంది. సదరు వ్యక్తికి ఫోన్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, చివరి పేమెంట్‌, చివరి ట్రాన్సాక్షన్‌ తదితర వివరాలను తెలిపితే మీ ఫోన్‌ పే అకౌంట్‌ను బ్లాక్‌ చేసేస్తారు.

Also Read: భారత స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీపై కన్నేసిన టెక్నో మొబైల్‌ సంస్థ.. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో విడుదల

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. మొబైల్‌ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్స్‌

Ghost Stories: అందమైన ఆ హోటల్ లో డెత్ మిస్టరీలు .. మూసిన తలుపులు వెనుక దెయ్యాల అరుపులు..