Asteroid: ఆరునెలల్లో భూమిని తాకనున్న భారీ గ్రహశకలం..ఎక్కడ పడుతుందో చెప్పగలిగినా..దానిని ఆపలేమంటున్న నాసా!

|

May 16, 2021 | 1:12 PM

Asteroid: భూమిపైకి వచ్చే గ్రహశకలాల విపత్తు ఘర్షణను నివారించడానికి శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. వీటి గమనం అర్థం చేసుకోవడానికి నాసా ఒక సమావేశం ఏర్పాటు చేసింది.

Asteroid: ఆరునెలల్లో భూమిని తాకనున్న భారీ గ్రహశకలం..ఎక్కడ పడుతుందో చెప్పగలిగినా..దానిని ఆపలేమంటున్న నాసా!
Asteroid
Follow us on

Asteroid: భూమిపైకి వచ్చే గ్రహశకలాల విపత్తు ఘర్షణను నివారించడానికి శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. వీటి గమనం అర్థం చేసుకోవడానికి.. అవి సరిగ్గా భూమిని తాకే సమయం..ప్రదేశం ముందుగా ఎలా తెలుసుకోవాలి అనే అశంపై నాసా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన సహచరులతో గత నెలలో “టేబుల్-టాప్” కార్యక్రమం నిర్వహించింది. సుమారు 35 మిలియన్ మైళ్ళు (56.3 మిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఉన్న ఒక గుర్తు తెలీని గ్రహశకలం భూమి వైపు వస్తోంది. అది ఆరు నెలల్లో భూమిని తాకే అవకాశం ఉంది. 2021 పిడిసి అనే ఈ ఊహాత్మక గ్రహశకలం యొక్క దిశను ఆపడానికి లేదా మార్చడానికి మార్గాలను రూపొందించడానికి శాస్త్రవేత్తలు ఏప్రిల్ 26 నుంచి ఒక వారం రోజులు సమావేశాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారికీ ప్రతిరోజూ గ్రహశకలం గురించి సమాచారం ఇవ్వబడింది. మన ఒకరోజు ఇది వ్యోమగామ కాలక్రమంలో ఒక నెలను సూచిస్తుంది. ఈ గ్రహశకలం 35m మరియు 700m మధ్య ఎక్కడైనా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన సమాచారాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించారు.

ఈ సమావేశం రెండో రోజు చివరికి యూరప్, ఉత్తర ఆఫ్రికాతో సహా విస్తారమైన ప్రాంతంలో ఆరు నెలల్లో గ్రహశకలం ప్రభావం ఉంటుందని వారు ధృవీకరించారు. అయితే, వారం చివరినాటికి, జర్మనీ మరియు చెక్ రిపబ్లిక్ మధ్య గ్రహశకలం భూమిని ఢి కొట్టే అవకాశం ఉందని వారు కొంత కచ్చితమైన ప్రదేశాన్ని చెప్పారు. అయితే, ప్రపంచాన్ని తుడిచిపెట్టకుండా భారీ గ్రహశాకలాన్ని ఆపడానికి ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఏదీ లేదని శాస్త్రవేత్తలు తరువాత తేల్చారు. ఉల్క విక్షేపం కోసం, ఆరు నెలల కన్నా ఎక్కువ సమయం అవసరమని వారు తెలిపారు.

నిజ జీవితంలో ఊహాత్మక దృష్టాంతాన్ని ఎదుర్కొంటే “ప్రస్తుత సామర్థ్యాలతో అటువంటి చిన్న నోటీసులో మేము ఏ అంతరిక్ష నౌకను ప్రయోగించలేము” అని శాస్త్రవేత్తలు ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రహశకలం భూమిపై నేరుగా అలాగే పడకుండా అంతరాయం కలిగించడానికి అణు పేలుడు పరికరాన్ని ఉపయోగించడం వల్ల గ్రహశకలం మీద ఎలా పనిచేస్తుంది అనేది చెప్పలేమన్నారు. కానీ, నష్టపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని వారు భావిస్తున్నట్లు చెప్పారు. ఏదేమైనా, సాధారణ అణు పేలుడు పరికరాల సామర్థ్యం భూమికి సమీపంలో ఉన్న వస్తువులను గట్టిగా దెబ్బతీసే సామర్థ్యం పెద్ద గ్రహశకలాలకు సరిపోకపోవచ్చు అని వారు అభిప్రాయపడ్డారు.

Also Read: ఇజ్రాయెల్, గాజాలో హింసపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీవ్ర ఆందోళన, బెంజమిన్ నెతన్యాహు, అబ్బాస్ లకు ఫోన్లు, శాంతియుత ఒప్పందానికి రావాలని సూచన

ఈ ప్రదేశం ఒక్కటే యావత్ ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్ అందిస్తుంది.. సమస్త జీవరాశికి జీవనాడి ఇదే.. ఎక్కడుందంటే..