Amazon Sale: ఈ టైమ్‌లో ఫోన్ కొంటే సగం డబ్బులు సేవ్.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే డిస్కౌంట్స్..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో వన్‌ప్లస్, శామ్‌సంగ్, ఐఫోన్, ఇతర కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ఇక్కడ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు ఎలా ఉన్నాయి. ఏ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Amazon Sale: ఈ టైమ్‌లో ఫోన్ కొంటే సగం డబ్బులు సేవ్.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే డిస్కౌంట్స్..
Best Mobile Deals At Amazon's Great Indian Festival

Updated on: Sep 23, 2025 | 1:14 PM

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఈ పండుగ సేల్, స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లను వాటి అసలు ధర కంటే సగం కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో లభించే కొన్ని ఉత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్ 16

ఈ సేల్‌లో ఐఫోన్ 16ను కేవలం రూ.51,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుంటే దీని ధర రూ.50,000 కంటే తక్కువగా లభిస్తుంది. A18 చిప్‌సెట్, ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్‌తో ఇది ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

వన్‌ప్లస్ 13

వన్ ప్లస్ 13 అసలు ధర రూ.79,999 కాగా బ్యాంక్ డిస్కౌంట్‌తో కేవలం రూ.57,749కే లభిస్తుంది. Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, ప్రీమియం అమోల్డ్ డిస్‌ప్లే దీనిని పవర్ యూజర్లకు అద్భుతమైన ఎంపికగా చేస్తాయి.

శామ్సంగ్ గెలాక్సీ S24

శామ్‌సంగ్ గెలాక్సీ S24 Snapdragon 8 Gen 3 వెర్షన్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.64,999 కాగా ఈ సేల్‌లో కేవలం రూ.39,999 కంటే తక్కువ ధరకు లభిస్తుంది. అమోల్డ్ డిస్‌ప్లే, AI ఫీచర్లు, శక్తివంతమైన కెమెరా పనితీరు వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఈ ధర వద్ద అద్భుతమైన డీల్‌గా చెప్పవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ 5

వన్ ప్లస్ Nord 5 ధర రూ.34,999 కాగా బ్యాంక్ ఆఫర్లతో కేవలం రూ.28,499కే లభిస్తుంది. Snapdragon 8s Gen 3 ప్రాసెసర్, 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 6,800mAh బ్యాటరీతో ఈ ఫోన్ మధ్య-శ్రేణి విభాగంలో అగ్రస్థానంలో ఉంది.

iQOO నియో 10R

ఐక్యూ Neo 10R అసలు ధర రూ.31,999 కాగా ఇప్పుడు రూ.24,899కి అందుబాటులో ఉంది. బ్యాంక్ డిస్కౌంట్‌తో దీని ధర ఇంకా తగ్గుతుంది. Snapdragon 8s Gen 3 ప్రాసెసర్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఇది మంచి పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.

ఇన్ఫినిక్స్ జిటి 30

గేమింగ్ లవర్స్ కోసం Infinix GT 30 ఒక మంచి ఎంపిక. దీని ధర రూ.24,999 కాగా బ్యాంక్ డిస్కౌంట్‌తో కేవలం రూ.17,959కే లభిస్తుంది. 144Hz అమోల్డ్ డిస్‌ప్లే, డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, గేమింగ్ ట్రిగ్గర్‌లు దీనిని ప్రత్యేకంగా నిలబెడతాయి.

ఇవే కాకుండా వన్ ప్లస్ 13R, ఒప్పో రెనో 14, వన్ ప్లస్ Nord CE 5 వంటి అనేక ఇతర స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఈ సేల్‌లో ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ అద్భుతమైన ఆఫర్లను వినియోగించుకోవడానికి యూజర్లు అమెజాన్ వెబ్‌సైట్ లేదా యాప్‌ను సందర్శించవచ్చు.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..