ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ ఫ్రీడమ్ సేల్ పేరుతో డిస్కౌంట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. గృహోపకరణాలు మొదలు, గ్యాడ్జెట్లపై ఊహకందని తగ్గింపు ధరలను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను అందిస్తున్నారు. అమెజాన్ సేల్‌లో లభిస్తున్న ఓ బెస్ట్ డీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ 12కి మార్కెట్లో మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌పై మంచి ఆఫర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ. 64,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో సేల్‌లో భాగంగా రూ. 59,999కి లభిస్తోంది. అయితే ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే ఈ ఫోన్‌పై రూ. 6000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 53,999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు అదనంగా రూ. 1000 కూపన్ కోడ్ కూడా లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 52,999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్‌పై సుమారు రూ. 12 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
ఆఫర్స్ ఇక్కడితో ఆగిపోలేవు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్ కండిషన్ ఆధారంగా గరిష్టంగా రూ. 54,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇలా ఈ ఫోన్‌పై గరిష్టంగా డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఇంతకీ వన్‌ప్లస్ 12లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోన్‌లో 6.82 ఇంచెస్‌తో కూడిన క్యూహెచ్‌డీ+ ఎల్‌టీపీఓ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 ఎంపీ, 48 ఎంపీ, 64 ఎంపీతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఈ ఫోన్ సొంతం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఇక ఈ ఫోన్‌లో ఆక్సిజన్ ఓఎస్‌ను అందించారు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనచేస్తుంది. 2కే డిస్‌ప్లేకు ఈ స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే వన్‌ప్లస్ 12లో 100 వాట్స్ సూపర్‌వూక్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌కు, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5400 ఎంఏహెచ్ కెసాసిటీ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 19 గంటల యూట్యూబ్ ప్లే బ్యాక్ అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..