చేతిలో స్మార్ట్‌ఫోన్, చెవిలో ఇయర్ ఫోన్స్ లేదా బడ్స్.. ఇది ప్రస్తుత ట్రెండ్.. చాలా వరకూ వైర్ లెస్ అయిపోయింది అంతా. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా దిగ్గజ స్మార్ట్‌ఫోన్ల కంపెనీలన్నీ బ్లూటూత్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఇదే కోవలో యాపిల్ కంపెనీ కూడా పలు రకాల ఇయర్ బడ్లను లాంచ్ చేసింది. వాటిలో యాపిల్ ఎయిర్ పోడ్స్ అత్యంత ప్రజాధరణ పొందాయి. వీటి ప్రీమియం సౌండ్ క్వాలిటీ, సులభమైన కనెక్టివిటీ, ఐకానిక్ డిజైన్ కారణంగా వినియోగదారులు అధికంగా కొనుగోలు చేశారు. వీటిపై ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఓ ప్రత్యేకమైన ఆఫర్ పెట్టారు. అతి తక్కువ ధరకే ఇది లభిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మొదటి Apple AirPodsను ఐఫోన్ 7తో పాటు 2016లో టెక్ దిగ్గజం ప్రారంభించింది. యాపిల్ తన పోర్ట్‌ఫోలియోలో చాలా రకాల వేరియేషన్లతో ఇయర్ బడ్లను ఆవిష్కరించింది. ఎయిర్ పోడ్స్ వేరియంట్లో మూడు జనరేషన్లు ఉండగా.. అలాగే ఎయిర్ పోడ్స్ ప్రో వేరియంట్ లో రెండు జనరేషన్లు, ఎయిర్ పోడ్స్ మ్యాక్స్‌లో రెండు జనరేషన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
Apple Air Pods జనరేషన్స్ లో సెకండ్ జనరేషన్ ఎయిర్‌పోడ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా విక్రయించబడుతున్నాయి. ఎందుకంటే ఈ సెకెండ్ జెన్ యాపిల్ ఎయిర్‌పోడ్‌లు ఫస్ట్ జెన్ కన్నా మెరుగైన బ్యాటరీతో వస్తాయి. డిజైన్ దాదాపు ఒకేలా ఉంటుంది. థర్డ్-జెన్ ఎయిర్‌పోడ్‌లో కూడా ఇలాంటి స్పెసిఫికేషన్లే ఉంటాయి గానీ డిజైన్ కొత్తగా ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే మూడు, రెండో జనరేషన్ ఆపిల్ ఎయిర్‌పోడ్‌ల మధ్య చాలా తక్కువ వ్యత్యాసం ఉంది. అయితే ధర విషయానికి వస్తే ఎక్కువగా ఉంది. దీని కారణంగానే కొనుగోలుదారులు సెకండ్ జనరేషన్ పై మొగ్గు చూపుతున్నారు. మీరు వీటిల్లో ఒకదాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకొని ఉంటే, ఇదే సరైన సమయం. ఎందుకంటే Apple Air Pods పై Flip kartలో మంచి ఆఫర్ నడుస్తోంది.
Apple Air Pods ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 11,990గా ఉంది. అయితే 2023 మొదటి వారంలో మాత్రం రూ. 1,499కి అందుబాటులో ఉటుంది. అదెలా అంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ చేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 10,500 వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. అంటే మీరు Apple Air Podలను రూ. 1,499కి పొందవచ్చు. ఇది కాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..