
ProxyEarth:టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మానవుకు ప్రైవసీ అనేది లేకుండా పోతుంది. వ్యక్తిగత వివరాలు అన్నీ పబ్లిక్ అయిపోయాయి. మన పర్సనల్, ఇతర వివరాలను ఎవరైనా యాక్సెస్ చేయగలిగేంతగా వచ్చిన టెక్నాలజీ మనకి ముప్పు తెచ్చి పెడుతోంది. సోషల్ మీడియా ద్వారా మన వ్యక్తిగత వివరాలు, మనం ఏ ఏరియాలో ఉన్నామనే విషయాలు ఇతరులు తెలుసుకునే వెసులుబాటు ఉంది. స్నాప్‌ఛాట్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటి ద్వారా మనం ఏ ప్రాంతంలో ఉన్నామనే విషయాలు ఎదుటివారు తెలుసుకోవచ్చు. ఇక నెట్టింట అనేక వెబ్‌సైట్లు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఈ ఫ్లాట్ఫామ్స్ ద్వారా మన పేరు, అడరస్, తండ్రి పేరు, లైవ్ లొకేషన్ కూడా తెలుసుకోవచ్చట. ఈ వెబ్‌సైట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ప్రాక్సీఎర్త్ అనే వెబ్‌సైట్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రాకేష్ అనే వ్యక్తి అభివృద్ది చేసిన ఈ మోసపురిత వెబ్‌సైట్ భారత్‌లో సంచలనంగా మారింది. ఎందుకంటే దీని ద్వారా భారతీయల వ్యక్తిగత వివరాలతో పాటు లైవ్ లొకేషన్ కూడా అందిస్తుంది. దీనికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. నెంబర్ ఇస్తే చాలు.. పేరు, అడ్రస్, తండ్రి పేరు లాంటి వ్యక్తిగత వివరాలతో పాటు లైవ్ లొకేషన్ కూడా ఇస్తోంది. మీ పేరుపై ఉన్న ఫోన్ నెంబర్ డీటైల్స్, ఈమెయిల్ ఐడీ, ఇతర పర్సనల్ డీటైల్స్ కూడా ఇందులో వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే ఈ వెబ్‌సైట్ వచ్చిది. ఎటువంటి లాగిన్స్ అవసరం లేకుండా దీనికి ఉపయోగించుకోవచ్చు. సిమ్ తీసునేటప్పుడు మనం పై వివరాన్నీ అన్నీ అందిస్తాము. టెలికాం రికార్డుల డేటా ఆధారంగా ఇందులో అన్నీ వివరాలు బయటపడుతున్నాయి. వ్యక్తిగత వివరాలు ఇలా బయటకు లీక్ అవ్వడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.
ఈ వెబ్‌సైట్ అభివృద్ది చేసిన రాకేష్ హ్యాకింగ్ చేసే కొన్ని వెబ్‌సైట్లను కూడా నడుపుతున్నాడు. అతడు ప్రోగ్రామింగ్‌తో పాటు వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్నెట్‌లో ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలతో పాటు పర్సనల్ విషయాలు లీక్ అవుతున్నాయని, తాను చేస్తున్నది తప్పు కాదని రాకేష్ సమర్ధించుకుంటున్నాడు. బహిరంగంగా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాలను మాత్రమే తాను ఉపయోగించి వెబ్‌సైట్ క్రియేట్ చేసినట్లు తెలిపాడు. ట్రాఫిక్‌తో పాటు తన ఇతర ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని అంటున్నాడు. రాకేష్ సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉన్నాడు. ఇలా భారతీయలు వ్యక్తిగత వివరాలు బయటకు లీక్ కావడం చాలా ప్రమాదకరం. ఆర్ధిక మోసాలకు పాల్పడేవారు ఈ వివరాలు ఉపయోగించుకుని డబ్బులు కొల్లగొట్టే అవకాశముంది. అంతేకాకుండా మన వ్యక్తిగత విషయాలకు గోప్యత కూడా ఉండదు.