ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ వంటి గృహోపకరణాలు తప్పనిసరయ్యాయి. అయితే గృహోపకరణాలు పెరిగే కొద్దీ కరెంటు బిల్లుల బాదుడు కూడా సగటు వినియోగదారుడిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏసీలు ఉన్న వారైతే కరెంట్ బిల్లులు గతంలో లేని విధంగా వస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు ఇటీవల కాలంలో గృహోపకరణాలను ఎప్పుడూ స్విచ్ఆన్ చేసి వదిలేసి రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉంటారు. కరెంట్ బిల్లుల అధికంగా రావడానికి అదే కారణమని తాజా నివేదికలో వెల్లడైంది. టీవీలు, ఏసీలు రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి ఆఫ్ చేసి స్విచ్ ఆన్‌లో ఉంటే ఉపకరణాలు గణనీయమైన శక్తిని వినియోగిస్తూనే ఉంటాయి. ఎండ్-యూజ్ ఎలక్ట్రికల్ పరికరాలు స్టాండ్‌బైలో ఉన్నప్పుడు లేదా వాటి మెయిన్ స్విచ్‌లు స్విచ్ ఆఫ్ చేయనప్పుడు విద్యుత్తునువినియోగించుకుంటాయని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ విధంగా కోల్పోయిన విద్యుత్తు సంవత్సరానికి విద్యుత్ బిల్లులపై అదనంగా రూ.1,000 ఖర్చు అవుతుందని సిటిజన్ కన్స్యూమర్, సివిక్ యాక్షన్ గ్రూప్ చేసిన సర్వే పేర్కొంది. ఈ తాజా సర్వే గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
గృహోపకరణాల స్విచ్‌లు ఆన్ చేసి ఉండడం వల్ల ఏటా గణనీయంగా విద్యుత్‌ను వినియోగిస్తాయ, స్టాండ్‌బై మోడ్‌లోని టీవీలు, సౌండ్ సిస్టమ్‌లు ఇతర నడుస్తున్న ఉపకరణాల కంటే ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. గత ఏడాది ఏడు జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో టీవీ, సెట్‌టాప్ బాక్స్, ఎయిర్ కండీషనర్, సౌండ్ సిస్టమ్స్ వంటి ఉపకరణాలను పరిగణనలోకి తీసుకుని సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎందుకంటే ఈ ఉపకరణాలు సాధారణంగా ప్రతి ఇంట్లో అందుబాటులో ఉంటాయి. 70 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు తమ ఉపకరణాలను స్టాండ్‌బై మోడ్‌లో 24 గంటలూ ఆన్‌లో ఉంచుతున్నారని సర్వేలో వెల్లడైంది. సిటిజన్ కన్స్యూమర్, సివిక్ యాక్షన్ గ్రూప్‌కి చెందిన సీనియర్ పరిశోధకుడు కె. విష్ణు రావు చాలా మంది వినియోగదారులకు ఈ విషయం తెలియదని పేర్కొన్నారు. ప్రజలు చాలా మంది ఈ విషయం తెలియక అధిక విద్యుత్‌ను వినియోగిస్తున్నారని వివరించారు. అయితే ఈ విషయంపై డిస్కమ్‌లు వినియోగదారులకు సరైన అవగాహన కల్పిస్తే విద్యుత్‌ను ఆదా చేయవచ్చని పేర్కొంటున్నారు.
గృహోపకరణాలు స్విచ్ ఆన్ చేసి రిమోట్ ద్వారా ఆఫ్ చేస్తే ట్రాన్స్‌ఫార్మర్‌పై పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఇంట్లో ఫోన్ చార్జర్లను సాకెట్‌కు పెట్టి స్విచ్ ఆఫ్ చేయడం లేదని, అందువల్ల భారం పెరిగే పరిస్థితి ఏర్పడిందని వివరిస్తున్నారు. ఏసీకు కనెక్ట్ చేసిన స్విచ్-ఆన్ చేసి వదిలేస్తే స్టెబిలైజర్ మాత్రం శక్తిని వినియోగిస్తుందని చెబుతున్నారు. రిమోట్‌తో ఉపకరణాలను స్విచ్ ఆఫ్ చేసే అలవాటును మార్చుకుంటే విద్యుత్‌ను ఆదా చేయవచ్చని పేర్కొంటున్నారు. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే డిస్కమ్ ఈ విషయంపై దృష్టి పెట్టి వినియోగదారులకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. లీకేజీ నష్టం గురించి డేటాను రూపొందించడానికి ఒక వివరణాత్మక జాతీయ-స్థాయి సర్వే, స్టాండ్‌బై పవర్ లాస్ ఉత్పత్తి కోసం నిర్వచించిన కోడ్‌లు, ప్రమాణాలను అభివృద్ధి చేయడం, స్టార్ లేబుల్‌లో వార్షిక స్టాండ్‌బై పవర్ సమాచారాన్ని (కేడబ్ల్యూహెచ్) చేర్చడంతో పాటు అన్ని ఉపకరణాలకు లేబులింగ్‌ను తప్పనిసరి చేయాలని నిపుణులు సూచనలు ఇస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి