Telugu News Technology AC Blast Precautions: Why Air Conditioners Explode in Summer and How to Prevent It Safety Tips
AC Blast: ఏసీలు ఎందుకు పేలుతాయో తెలుసా? అది.. ఇది ఏదీ కాదు.. అసలు కారణాలు ఇవే..!
AC Blast Precautions: వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఇళ్లల్లో, కార్యాలయలలో ఎయిర్ కండీషనర్‌లను వాడుతుంటారు. అయితే ఏసీ విషయంలో కొన్ని సేఫ్టి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపాటి అజాగ్రత్తగా ఉన్నా పేడులు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందంటున్నారు. మనం చేసే తప్పులేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..
AC Blast Precautions: వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు మనం ఏసీలను ఆశ్రయిస్తాం. కానీ చిన్నపాటి అజాగ్రత్త వల్ల ఆ ఏసీలే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఏసీలు ఎందుకు పేలుతాయి? మనం చేసే తప్పులేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఏసీలు ఎందుకు పేలుతాయి?
ఎయిర్ కండీషనర్ పేలడానికి ప్రధాన కారణం కంప్రెషర్‌లో ఒత్తిడి పెరగడం. దీనికి దారితీసే మరికొన్ని కారణాలు:
నిరంతరాయంగా వాడటం: ఏసీని గంటల తరబడి విశ్రాంతి లేకుండా వాడటం వల్ల ఓవర్ హీటింగ్ (అధిక వేడి) సమస్య తలెత్తుతుంది.
దుమ్ము చేరడం: అవుట్‌డోర్ యూనిట్‌లోని కాయిల్స్‌పై దుమ్ము పేరుకుపోతే, వేడి బయటకు వెళ్లలేక కంప్రెషర్‌పై ఒత్తిడి పెరుగుతుంది.
గ్యాస్ లీకేజీ: ఏసీ గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు వైరింగ్‌లో చిన్న స్పార్కింగ్ (నిప్పురవ్వ) వచ్చినా అది పేలుడుకు దారితీస్తుంది.
వోల్టేజ్ సమస్యలు: వోల్టేజ్ హెచ్చుతగ్గులు, నాణ్యత లేని వైరింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదాలు సంభవిస్తాయి.
ఏసీ సౌకర్యం కోసం మాత్రమే కాదు, భద్రత విషయంలోనూ మనం అప్రమత్తంగా ఉండాలి. సర్వీసింగ్‌లో చేసే చిన్న నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారితీయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఈ వేసవిని సురక్షితంగా ఆస్వాదించండి.