
ఆధార్ యాప్ ద్వారా వినియోగదారులు ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, తమ మొబైల్ నంబర్ చిరునామాను అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఫేస్ ఆథెంటికేషన్, QR కోడ్ ఆధారిత సురక్షిత షేరింగ్, బయోమెట్రిక్ లాక్ సౌకర్యాలు ఈ యాప్‌ను మరింత నమ్మదగినదిగా మార్చాయి. డిజిటల్ భద్రతను మెరుగుపరిచే క్రమంలో UIDAI తీసుకున్న ఈ నిర్ణయం, ఆధార్ వినియోగదారులకు ఎంతో ఊరటనిస్తోంది. ఈ కొత్త యాప్‌లో అందుబాటులో ఉన్న ఇతర ముఖ్యమైన ఫీచర్లు మరియు వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఈ ఆధార్ యాప్‌ను కేవలం ఆధార్ నిర్వహణకే పరిమితం చేయకుండా, రోజువారీ డిజిటల్ ఐడెంటిటీ కార్డుగా UIDAI అభివృద్ధి చేస్తోంది. హోటల్ చెక్-ఇన్‌లు, ఆస్పత్రి అడ్మిషన్లు, ఈవెంట్ ఎంట్రీలు మరియు గిగ్ వర్కర్ల ధృవీకరణ వంటి అనేక రంగాల్లో Offline Verification Seeking Entity (OVSE) QR కోడ్ స్కానింగ్ ద్వారా ఈ యాప్ కీలకపాత్ర పోషించనుంది.
ఆధార్ సేవలను మరింత ప్రజాదరణ పొందడమే కాకుండా, పేపర్‌లెస్, కాంటాక్ట్‌లెస్ పద్ధతుల్లో పౌరుల సమయాన్ని ఆదా చేసేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. మీరు ఇంకా ఈ కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోకపోతే, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని ఆధార్ సేవలను మీ స్మార్ట్‌ఫోన్ నుంచే సులభంగా పొందండి.