భారత్‌లో స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్‌ల వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ఈ కోవలోనే ఫైర్‌బోల్ట్ సంస్థ తమ కంపెనీ తరఫున స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న వ్యాలెంటైన్ వీక్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ వాచ్‌లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. తమ ఫైర్‌బోల్ట్ టాక్ అల్ట్రా స్మార్ట్ వాచ్‌పై ఏకంగా 70 శాతం తగ్గింపు ధరకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.7000 విలువైన స్మార్ట్ వాచ్‌ను రూ.2999కే సేల్‌లో అందుబాటులో ఉంది. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు మెటల్ బాడీ ఈ వాచ్ ప్రత్యేకత. అలాగే 1.39 అంగుళాల కలర్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఈ వాచ్ వినియోగదారులను అలరిస్తుంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లో గరిష్టంగా 123 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. అలాగే ఈ వాచ్‌ను ధరిస్తే శరీరంలోని హర్ట్ రేట్, ఆక్సిజన్ రేట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ వాచ్‌లోని టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, స్పీకర్లు మంచి నాణ్యతతో ఉండడంతో కస్టమర్ల మనస్సును ఈ వాచ్ దోచుకుంది. ఈ నేపథ్యంలో ఈ వాచ్‌పై గణనీయమైన తగ్గింపును ప్రకటించడంతో కొనుగోళ్లు మరింత పెరుగుతాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఫైర్‌బోల్ట్ టాక్ అల్ట్రా స్మార్ట్ వాచ్ ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..