Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

టిడిపి భేటీలో చేతివాటం.. విషయం తెలిసి బాబు షాక్

tdp leaders shocked in tirupati, టిడిపి భేటీలో చేతివాటం.. విషయం తెలిసి బాబు షాక్

వరుస షాకులతో టిడిపి అధినాయకత్వం.. నేతలు సతమతమవుతుంటే.. ఆ పార్టీ కార్యకర్తలు పరేషాన్ అయిన ఉదంతం తిరుపతిలో జరిగింది. అది కూడా సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే టిడిపి శ్రేణులను పరేషాన్‌కు గురి చేసిన ఉదంతం జరగడంతో విషయం తెలిసిన చంద్రబాబు కూడా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇంతకీ పార్టీలో ఏం జరిగిందనేదే కదా ప్రశ్న ?… రీడ్ దిస్..

tdp leaders shocked in tirupati, టిడిపి భేటీలో చేతివాటం.. విషయం తెలిసి బాబు షాక్త్తూరు జిల్లా తిరుపతిలో టీడీపీ శ్రేణుల మీటింగ్‌. అధినేత చంద్రబాబు హాజరయ్యారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. సమావేశం ప్రారంభమైంది. అధినేత చంద్రబాబు ప్రసంగం మొదలైంది. అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఓటమితో నిరాశ చెందవద్దు అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. వచ్చే లోకల్‌ బాడీ ఎన్నికల టార్గెట్‌గా పార్టీ వర్గాలంతా సిద్దం కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు జోష్‌గా ఫీలయ్యారు. అలా ఫీలవుతూనే యధాలాపంగా జేబులు తడుముకున్నారు. అంతే ఒక్కసారిగా చాలా మంది షాక్ అయ్యారు. ఇంతకీ మీటింగ్‌లో ఏం జరిగింది? వారికి షాక్‌ కొట్టిన విషయమేంటి?

tdp leaders shocked in tirupati, టిడిపి భేటీలో చేతివాటం.. విషయం తెలిసి బాబు షాక్

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి. ఇక్కడే చంద్రబాబు మకాం వేశారు. మూడు రోజుల పాటు పార్టీ కేడర్‌లో నూతన ఉత్తేజం నింపే పనిలో చంద్రబాబు ఉంటే…కొందరు చేతి వాటాన్ని ప్రదర్శించి నేతలు, పార్టీ వర్గాల జేబులు ఖాళీ చేశారట.

ఒక వైపు నియోజకవర్గాల సమీక్షలు…మరోవైపు కేడర్‌కు భరోసా ఇచ్చేందుకు వైసీపీ బాధితుల గోడును వింటున్న చంద్రబాబు పోలీసుల తీరుపై సీరియస్‌గా రెస్సాండ్‌ అవుతుంటే…దొంగలు తమ పని తాము చేసుకుపోయారట.

అధినేత కేడర్‌ దిశానిర్దేశం చేస్తుండగా శ్రద్ధగా వింటున్న నేతలు కార్యకర్తల జేబుల్లోని పర్సులు,వారి మొబైల్‌ పోన్లు కూడా మాయం అయ్యాయట. దాదాపు 20 మంది నేతలు పర్సులు మాయం అయితే…కొందరు కార్యకర్తల మొబైళ్లు కూడా దొంగలు దోచుకుపోయారట.

tdp leaders shocked in tirupati, టిడిపి భేటీలో చేతివాటం.. విషయం తెలిసి బాబు షాక్

 

టీఎన్ఎస్‌ఎఫ్‌ నేత రవినాయుడు కూడా పర్సు పొగొట్టుకున్న బాధితుల్లో ఒకరు. పర్సులు,మొబైళ్లు పొగొట్టుకున్న వారు చాలా మంది ఆలస్యంగా జేబులు తడుముకుని చూసుకుంటున్నారట. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు పర్సులు, సెల్‌ఫోన్లు మిస్‌ కావడంతో కొందరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారట.

టీడీపీ సమీక్షా సమావేశాలకు పాల్‌కాన్‌ వెహికల్‌తో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. కిలోమీటర్‌ దూరం వరకు 8 కెమెరాలతో పర్యవేక్షించారు. కానీ జేబుదొంగలను మాత్రం పట్టుకోలేకపోయారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో కూడా దొంగల చేతివాటం విజువల్స్‌ రికార్డు కాకపోవడంతో నేతల పర్సులు,మొబైల్‌ ఫోన్ల చేతివాటంపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేకపోయారట. మొత్తానికి ఈసారి మీటింగ్‌లకు వెళితే జేబులు కూడా జాగ్రత్త అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.