Sye Raa: ముగిసిన థియేట్రికల్ బిజినెస్.. చిరు స్టామినాకు ఇది మరో నిదర్శనం

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ సైరా దూసుకుపోతున్నాడు. కాగా తాజాగా ఈ మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ ముగిసింది. మెగాస్టార్ స్టామినాకు తగ్గట్లుగా మూవీ రైట్స్ 110కోట్లకు అమ్ముడుపోవడం […]

Sye Raa: ముగిసిన థియేట్రికల్ బిజినెస్.. చిరు స్టామినాకు ఇది మరో నిదర్శనం
Follow us

| Edited By:

Updated on: Sep 11, 2019 | 9:48 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ సైరా దూసుకుపోతున్నాడు. కాగా తాజాగా ఈ మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ ముగిసింది. మెగాస్టార్ స్టామినాకు తగ్గట్లుగా మూవీ రైట్స్ 110కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. ఇక టాలీవుడ్‌లో ఇప్పటివరకు బాహుబలి 2, సాహో సినిమాలు మాత్రమే 100కోట్లకు పైగా బిజినెస్ చేయగా.. ఇప్పుడు వాటి సరసన చేరింది సైరా.

అయితే దాదాపు పదేళ్ల తరువాత ‘ఖైదీ నంబర్.150’తో టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్. ఆ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద 150కోట్లకు పైగా కలెక్షన్లను సాధించాడు చిరు. ఇక ఈ మూవీ తరువాత మెగాస్టార్ నటించిన చిత్రం ‘సైరా’ కావడంతో ఆటోమేటిక్‌గా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం, ఫస్ట్‌లుక్‌లు, టీజర్లు ఆకట్టుకోవడంతో సైరాలో ప్రేక్షకులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. వాటికి తగ్గట్లుగా సినిమా ఉంటుందని మూవీ యూనిట్ ధీమాను వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ మూవీ కోసం ప్రమోషన్లలో కూడా వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగంగా ఈ మూవీ ఆడియో వేడుకను త్వరలో నిర్వహించబోతున్నారు. తెలుగుకు సంబంధించి హైదరాబాద్‌‌లో సైరా ఆడియో రిలీజ్ ఉండబోతుందని.. అందుకోసం ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది.

కాగా ఈ మూవీలో చిరు సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, రవి కిషన్, అనుష్క, నిహారిక తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించాడు.