సుశాంత్ కేసులో కొత్త మలుపు.. రియాపై ఎఫ్ఐఆర్ నమోదు

సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ రియాపై పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఐపీసీ341, 342, 380, 406, 420, 306 సెక్షన్స్ కింద పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సుశాంత్ కేసులో కొత్త మలుపు.. రియాపై ఎఫ్ఐఆర్ నమోదు
Follow us

|

Updated on: Jul 29, 2020 | 1:26 PM

FIR Lodged Against Rhea Chakraborty: యంగ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్‌ సూసైడ్ బాలీవుడ్‌ను షాక్ చేసింది. సుశాంత్ మరణానికి ఇండస్ట్రీలో బంధుప్రీతే కారణమంటూ కొందరు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ కేసుపై విచారణ జరుపుతున్న ముంబై పోలీసులు ఇప్పటికే సంజయ్ లీలా బన్సాలీ, మహేష్ భట్, ధర్మా ప్రొడక్షన్స్ సీఈఓ, ఆదిత్య చోప్రా లాంటి బాలీవుడ్ ప్రముఖుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. అటు నిర్మాత కరణ్ జోహార్‌కు కూడా నోటిసులు ఇచ్చిన ముంబై పోలీసులు మరి కొందరిని కూడా విచారించేందుకు సిద్దమయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ రియాపై పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఐపీసీ341, 342, 380, 406, 420, 306 సెక్షన్స్ కింద పాట్నా పోలీసులు కేసు ఫైల్ చేశారు. రియా చక్రవర్తి సుశాంత్‌ను మోసం చేసిందని.. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిందని ఆయన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

అటు సుశాంత్‌ను ఆర్ధికంగా, మానసికంగా కృంగదీసిందని తెలిపారు. రియాతో పాటు ఆమె కుటుంబసభ్యుల పేర్లను కూడా కేకే సింగ్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సుశాంత్ ఆర్ధిక లావాదేవీలను రియా చక్రవర్తి ఆమె కుటుంబమే నిర్వహించేదని.. ఈ విషయంలో సుశాంత్‌పై ఒత్తిడి పెంచారని ఆయన ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా గతేడాది సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి దాదాపు రూ. 15 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో రియాను విచారించేందుకు పాట్నా పోలీసులు ముంబై చేరుకున్నారు. అటు రియాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు పట్నా సెంట్రల్ జోన్ ఐజీ సంజయ్ సింగ్ ధృవీకరించారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా ఏఎన్ఐ తన ట్వీట్‌లో తెలిపింది. కాగా, తాను సుశాంత్‌ను నిజంగానే ప్రేమించానని.. సుశాంత్ ఆత్మహత్య విషయమై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని రియా ఇప్పటికే హోమ్ మినిస్టర్ అమిత్ షాని కోరిన సంగతి విదితమే.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

 సుశాంత్ మరణం వెనుక రహస్యాలు.. షాకింగ్ నిజాలు.. వైరల్ వీడియో..