మోదీలో ఆ దిగ్గజాలను చూశాను – రజినీకాంత్

Super Star Rajinikanth, మోదీలో ఆ దిగ్గజాలను చూశాను – రజినీకాంత్

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో కాబోయే ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, జయలలిత మాదిరిగానే నరేంద్ర మోదీ ప్రజాకర్షక నేత అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఎన్డీయే రెండోసారి అధికారంలోకి రావడానికి మోదీ ప్రభంజనం దోహదపడిందన్న ఆయన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో మాత్రం మోదీ హవా లేదని స్పష్టం చేశారు.

అటు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్.. రాహుల్ తన పదవికి రాజీనామా చేయకూడదని.. విజయం సాధించగలనని నిరూపించుకోవాలని హితవు పలికారు. అంతేకాకుండా ప్రతిపక్షం అనేది చాలా పటిష్టంగా ఉండాలని ఆయన అన్నారు.

అటు ఈనెల 30న నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని.. ఆ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు రజినీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 38 నియోజకవర్గాల్లో యూపీయేకి 37 స్థానాలు లభించాయి. ఈ కూటమిలోని కాంగ్రెస్‌ 8, డీఎంకే 23 స్థానాలు దక్కించుకున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *