పశ్చిమ బెంగాల్‌లో జలప్రవాహం.. ప్రాణాలతో బయటపడ్డ విద్యార్థులు

Students Rescued From Heavy Rush Of Water Falls In West Bengal, పశ్చిమ బెంగాల్‌లో జలప్రవాహం.. ప్రాణాలతో బయటపడ్డ విద్యార్థులు

పశ్చిమబెంగాల్ పురోలియా పరిధిలోని జమ్ని వాటర్ ఫాల్స్‌ వద్ద వరదలో చిక్కుకున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ప్రవాహం మధ్యలోనే విద్యార్థులు చిక్కుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరిలో ముగ్గుర్ని రక్షించారు. మరో ఇద్దరిని రక్షించేందుకు శ్రమిస్తున్నారు. పురులియా జిల్లాలో ఉన్న అయోధ్య హిల్స్ సందర్శనకు అక్కడ స్థానిక కళాశాల విద్యార్థులు వచ్చారు. సరదాగా వీరంతా అయోధ్య కొండపై ఉన్న జమ్మి జలపాతం కొండ అంచుకు వెళ్లారు. సరదాగా గడుపుతున్న సమయంలో అనుకోకుండా వరద నీరు పోటెత్తింది. ప్రమాదాన్ని పసిగట్టిన విద్యార్థులు ఎత్తుగా ఉన్న రాక్ పైకి చేరుకున్నారు. సుమారు 3 గంటల పాటు నరకయాతన అనుభవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *