Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • చెన్నై నగరంలో మరికొన్ని ఆంక్షల సడలింపు. ఉ. 6.00 నుంచి రాత్రి 9.00 వరకు హోటళ్లు (పార్సిల్ సర్వీసు మాత్రమే). రాత్రి 9.00 వరకు మాత్రమే హోం డెలివరీ ఉ. 6.00 నుంచి సా. 6.00 వరకు టీ స్టాళ్లకు అనుమతి. కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలు ఉ. 6 నుంచి సా. 6 వరకు. మాల్స్ మినహా మిగతా దుకాణాలు ఉ. 10 నుంచి సా. 6 వరకు. సడలింపులు జులై 6 నుంచి అమలు.
  • విశాఖ: కేజీహెచ్ సూపరెంటెండెంట్ డాక్టర్ అర్జున. క్లినకల్ ట్రయల్స్ కు కేజీహెచ్ ను ఎంపిక చేసునట్టు ఐసీఎంఆర్ నుంచి మెయిల్ వచ్చింది. క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రభుత్వ అనుమతి కోరాం. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా - డీసీజీఐ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఎథిక్స్ కమిటీ విధివిధానాలు తరువాత కార్యకలాపాలు ప్రారంభిస్తాం. అన్ని క్లియరెన్స్ లు పూర్తయ్యేందుకు 3 రోజుల సమయం పట్టే అవకాశముంది. ఆ తరువాత కేజీహెచ్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తాం.
  • కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు.. ఐసోలేషన్ సెంటర్లుగా మారిన బ్యూటీ పార్లర్లు. నిబంధనలను తుంగలో తొక్కి కోవిడ్ రోగులకు గదులు అద్దెకు ఇస్తున్న వైనం. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు గదులు అద్దెకు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని colours బ్యూటీ స్టూడియోలో కరోనా పాజిటివ్ వ్యక్తులకు అశ్రయం. రోజుకు రూ.10వేల ఫీజు.. వసూలు..గుట్టు చప్పుడు కాకుండా అక్రమ దందా.
  • REC, ఫైనాన్స్ కార్పొరేషన్ ల నుంచి 12600 కోట్ల రూపాయలు అప్పు తీసుకునేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలకు గ్యారెంటీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సర్కార్. అప్పుల్లో కూరుకుపోయిన డిస్కమ్ లకు ప్రభుత్వ అనుమతితో ఊరట.
  • టీవీ9 తో సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా. తెలంగాణలో వైరస్ సమూల మార్పుని చోటుచేసుకుంటున్నాయి . ఇప్పటి వరకు తెలంగాణలో సింటమ్స్ కనిపించే a3i (ఏత్రీఐ) వైరస్ ఉండేది. ఇప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించని a2a (ఏటుఏ) వైర్ 90శాతం విస్తరించింది. కరోనా మృత దేహాల నుంచి వైరస్ వ్యాప్తి విషయంలో ఆందోళన వద్దు. డెడ్ బాడీస్ నుంచి వచ్చే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. కరోనా వైరస్ ప్రభావం కేవలం ఊపిరితిత్తుల మీదేకాదు మిగిలిన అవయవాల పైనా ఉంది. చేస్తున్న టెస్టులకు పది రెట్లు అధికంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ ల విధానం సిసిఎంబీలో అభివ`ద్ధి చేశాం. ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ ల పద్ధతి లో టెస్టింగ్ సమయంలో సగం ఆదా అవుతుంది. ఈ పద్దతిలో రోజుకి 500 టస్ట్లు చేసే చోట 1500 నుంచి 2000 వరకు చేయవచ్చు.
  • హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కరోనా కలకలం. డైమండ్ వ్యాపారి పుట్టిన రోజు వేడుకల్లో వ్యాపించిన కరోనా. వేడుకల్లో పాల్గొన్న 20 మందికి కరోనా పాజిటివ్ . బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న సుమారు 150 మంది వ్యాపారులు , రాజకీయ నాయకులు . ఫంక్షన్ లో పాల్గొన్న ఒకరు చనిపోవడంతో మరింత ఆందోళనలు . ఈ వేడుకల్లో పాల్గొన్న ఇద్దరు రాజకీయ నాయకులకు సైతం సోకిన కరోనా

అద్భుత కట్టడం… బేలూరు చెన్నకేశవ ఆలయం!

Sri Chennakeshava Temple in Belur history timings and how to reach, అద్భుత కట్టడం… బేలూరు చెన్నకేశవ ఆలయం!

కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలోని చెన్నకేశవ దేవాలయం అతి ప్రాచీనమైనది. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసలుల రాజవంశస్థులు నిర్మించినట్లు చారిత్రక నిపుణులు పేర్కొంటున్నారు. బేలూర్ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశం. అనేక ఆలయాలకు నెలవైన ఈ పట్టణం హసన్ జిల్లా లో బెంగుళూర్ నుండి కేవలం 220 కి. మీ. ల దూరంలో ఉంది. ఇది యగాచి నది ఒడ్డున కలదు , దీని ప్రాచీనమైన, విశిష్టమైన దేవాలయల వలన దీనిని అందరు దక్షిణ కాశి అంటారు.

బేలూర్ విశిష్టత

బేలూర్ హోయసలుల సామ్రాజ్య రాజధానిగా ఉంది కనుక చారిత్రకంగా బేలూర్ విశిష్టమైనది. ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబిడ్ కూడా హొయసల రాజధానిగా ఉంది ఇది పురాతన నగరం. ఈ రెండు నగరాలు ఈ రెండు నగరాలు హొయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధ ఉదాహరణలు – తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకే సారి దర్శిస్తూ ఉంటారు.

విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం ఎంతొ ప్రసిద్ధి. బేలూర్ లో అన్నిటికన్నా గొప్ప ఆలయ సముదాయం నిస్సందేహంగా చెన్నకేశవ ఆలయం. ఈ ఆలయం లోని రక రకాల శిల్పాలు ఎంతొ సజీవంగా ఉన్నాయా అన్నంత బాగుంటాయి.

అత్యంత రమణీయమైన చెన్నకేశవ దేవాలయం

బేలూర్ లోని అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినది. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయము, విష్ణువు యొక్క ఒక అవతారము ఐన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది. యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు పర్యాటకులు పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వీటితో పాటు, వివిధ రంగులలో చెక్కిన నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి.
ఇంకా వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు ఇంకా వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. అందులో ముఖ్యంగా దర్పణ సుందరి, భస్మ మోహిని అనేవి చెప్పుకోదగిన ఆకర్షణీయ శిల్పాలలో కొన్ని!

పుష్కరణి(మెట్లబావి)

ఆలయం యొక్క అంతర్భాగంలో విజయనగర సామ్రాజ్యం రోజులలో ఈ ఆలయం యొక్క రాజగోపురాలు నిర్మించబడ్డాయి. ఆలయం యొక్క అంతర్భాగంలోనే కప్పే చేన్నిగరాయ ఆలయం, మరియు లక్ష్మి దేవీకి అంకితం చేసిన ఒక చిన్న కట్టడము కూడా ఉన్నాయి.

బేలూర్ – గ్రావిటీ పిల్లర్

ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంది. మహాస్తంభం లేదా కార్తిక దీపోత్సవ స్తంభం అని పిలవబడే ఈ 42 అడుగుల ఈ స్తంభం చెన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది. హొయసల శైలి శిల్పకళకు నిలువుటద్దంగా ఈ దేవాలయం వుంటుంది.

ఎలా వెళ్ళాలి?

రోడ్డు మార్గం

బేలూర్ హళేబీడు లకు మీరు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. హస్సన్ నుండి బస్సు ద్వారా గాని లేకుంటే మీకు సొంత వాహనం ఉంటే మీరే సొంతంగా డ్రైవ్ చేసుకొని రావచ్చు. హస్సన్ రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుంచి, వివిధ నగరాలనుంచి బెంగళూరు, మైసూరు నుంచి కూడా బస్సులు వస్తుంటాయి.

రైలు మార్గం

హస్సన్ రైల్వే స్టేషన్ కు బెంగళూరు, మైసూరు, మంగళూరు ప్రాంతాలనుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

వాయు మార్గం

చేరువలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సుమారుగా 223 కి. మీ .దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం కి దేశంలోని ప్రధాన నగరాలనుంచే కాక, వివిధ దేశాల నుంచి కూడా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

Related Tags