వీధుల్లో క్లోరినేషన్ వల్ల ఫలితం లేదు…ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా వైరస్ నివారణకు అనేక దేశాల్లో.... వీధుల్లో డిస్ ఇన్ ఫెక్టెంట్లను స్ప్రే చేయడంవల్ల వైరస్ నశించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. పైగా ఇది మానవ ఆరోగ్యానికి హానికరమని కూడా హెచ్చరించింది.

వీధుల్లో క్లోరినేషన్ వల్ల ఫలితం లేదు...ప్రపంచ ఆరోగ్య సంస్థ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 17, 2020 | 11:05 AM

కరోనా వైరస్ నివారణకు అనేక దేశాల్లో…. వీధుల్లో డిస్ ఇన్ ఫెక్టెంట్లను స్ప్రే చేయడంవల్ల వైరస్ నశించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. పైగా ఇది మానవ ఆరోగ్యానికి హానికరమని కూడా హెచ్చరించింది. వైరస్ నివారణకోసం రోడ్లు, ఇళ్ల గోడల పైన, మార్కెట్ కూడళ్లలో ఈ మందును చల్లితే ప్రయోజనం లేదని, కెమికల్ స్ప్రే తో ఆశించిన ఫలితాలు  రావని ఈ సంస్థ ఓ డాక్యుమెంట్ లో స్పష్టం చేసింది. అలాగే వ్యక్తులపై స్ప్రే చేయడం వల్ల వారి కళ్ళు మండడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కూడా పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము దీనిని సిఫారసు చేయడంలేదని వెల్లడించింది. క్లోరినేషన్ చేయాలంటే.. క్లోరిన్ ద్రావణంలో బట్టను ముంచి దాంతో తుడవాలని సూచించింది. గోడలు వంటి ఉపరితలాలపై అనేక రకాల వైరస్ లు ఉంటాయి.. ఇవి రోజులతరబడి కూడా అలాగే ఉంటాయి.. అని ఓ అధ్యయనం కూడా వెల్లడించింది. అయితే ల్యాబ్ కండిషన్స్ బట్టి ఈ విషయాలను వెలువరిస్తున్నామని, రియల్ వరల్డ్ ఎన్విరాన్ మెంట్ లో అప్రమత్తంగా ఉండడం మంచిదని కూడా ఈ స్టడీ వివరించింది.