అంతర్జాతీయ క్రికెట్‌కు యూవీ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రకటించాడు. క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందన్న యూవీ.. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన ఆటకు దూరం అవుతుండటం ఎంతో బాధగా ఉందని తెలిపాడు. ఇన్ని రోజులుగా తనను ఆదరించిన అభిమానులకు.. తన వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలంటూ పేర్కొన్నాడు. తన జీవితం ఓ రోలర్ కోస్టర్‌లా మారిందంటూ ఉద్వేగంగా వెల్లడించాడు యూవీ. సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి […]

అంతర్జాతీయ క్రికెట్‌కు యూవీ గుడ్‌బై

Edited By:

Updated on: Jun 10, 2019 | 9:33 PM

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రకటించాడు. క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందన్న యూవీ.. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన ఆటకు దూరం అవుతుండటం ఎంతో బాధగా ఉందని తెలిపాడు. ఇన్ని రోజులుగా తనను ఆదరించిన అభిమానులకు.. తన వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలంటూ పేర్కొన్నాడు. తన జీవితం ఓ రోలర్ కోస్టర్‌లా మారిందంటూ ఉద్వేగంగా వెల్లడించాడు యూవీ. సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించాడు.

2011 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన యువీ.. కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ విజయంలోనూ యువరాజ్‌ తన పాత్ర పోషించాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువీ.. 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us