భారత్ తరపున కోహ్లీకే ఆ ఘనత!

| Edited By:

Jun 15, 2019 | 5:06 PM

ప్రపంచంలోనే ప్రఖ్యాత‌ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మాత్రమే స్థానం దక్కించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ అయిన కోహ్లి 100వ స్థానంలో నిలిచారు. కోహ్లి ఆదాయం గత 12 నెలల్లో 25 మిలియన్ డాలర్లు. ఇందులో 21 మిలియన్ డాలర్లు ఎండోర్స్‌మెంట్స్ రూపంలో ఆర్జిస్తే, మిగతా 4 మిలియన్ డాలర్లు వేతనం రూపంలో ఆర్జించారు. అయితే గతేడాది 83వ […]

భారత్ తరపున కోహ్లీకే ఆ ఘనత!
Follow us on

ప్రపంచంలోనే ప్రఖ్యాత‌ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మాత్రమే స్థానం దక్కించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ అయిన కోహ్లి 100వ స్థానంలో నిలిచారు. కోహ్లి ఆదాయం గత 12 నెలల్లో 25 మిలియన్ డాలర్లు. ఇందులో 21 మిలియన్ డాలర్లు ఎండోర్స్‌మెంట్స్ రూపంలో ఆర్జిస్తే, మిగతా 4 మిలియన్ డాలర్లు వేతనం రూపంలో ఆర్జించారు. అయితే గతేడాది 83వ స్థానంలో ఉన్నా కోహ్లి ఇప్పుడు 100వ స్థానంలో నిలిచారు. అర్జెంటినా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 127 మిలియన్ డాలర్లతో తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్నాడు.

ఐసీసీ ప్రపంచ కప్ 2019 టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడనుంది. కోహ్లి కెప్టెన్సీలోని భారత్ జట్టు ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లోనూ గెలుపొందగా.. గురువారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.