భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీకి టెస్టు క్రికెట్‌లో ఓ అద్బుతమైన రికార్డు ఉంది. అది ఏంటో మీకు తెలుసా
భారత టెస్టు క్రికెట్ కెప్టెన్‌గా కొహ్లీ 2014లో జట్టు పగ్గాలు చేపట్టారు. నాటి నుంచి 2020 వరకు 56 మ్యాచులు ఆడారు. ఇందులో 33 విజయాలు కాగా, 12 అపజయాలు ఉన్నాయి. 10 మ్యాచుల్లో ఫలితాలు తేలలేదు. అయితే కొహ్లీ నమోదు చేసిన విజయాల శాతం 58.92. కాగా, అపజయాల శాతం 21.42గా నమోదైంది.
కొహ్లీ టెస్టు కెప్టెన్‌గా 56 మ్యాచ్‌లు అడగా.. 26 మ్యాచుల్లో కొహ్లీ టాస్ గెలిచాడు. వాటిలో 22 విజయాలు సాధించాయి. 4 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. అయితే తాజాగా జరుగుతున్న ఆస్ట్రేలియా – భారత్ టెస్టు సిరీస్ 1 టెస్టు మ్యాచ్‌లో సైతం కొహ్లీ టాస్ గెలిచాడు. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో క్రికెట్ విశ్లేషకులు మొదటి టెస్టు మ్యాచ్‌లో విజయం మనదే అంటూ ప్రచారం మొదలెట్టారు.