Boxer Satish Kumar: టోక్యో ఒలంపిక్స్ ఏడో రోజులోకి అడుగు పెట్టాయి. ఇప్పటివరకూ మీరాబాయి చాను గెలుచుకున్న రజతం తప్ప.. మరొక పతాకం దక్కించుకోలేదు.. అయితే ఈరోజు జరుగుతున్న పోటీల్లో భారత క్రీడాకారులు మంచి ఫలితను సాధిస్తున్నారు. దాదాపు అన్నికేటగిరీల్లోనూ అద్భుతంగా విజయాలను సొంతం చేసుకుంటూ.. పతాకాలపై ఆశలను రేపుతున్నారు. పీవీ సింధు, హాకీ తదితర విభాగాల్లో గెలుపొందగా.. తాజాగా బాక్సింగ్ లో కూడా విజయం సొంతం చేసుకుంది. భారత బాక్సర్ ఆర్మీ అధికారి సతీష్ కుమార్ నాకౌట్ లో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టడానికి మార్గం సుగమం చేసుకున్నాడు. 91 కేజీల పురుషుల సూపర్ హెవీ వెయిట్ విభాగంలో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టడం ఇదే ఫస్ట్ టైం. పురుషుల సూపర్ హెవీవెయిట్ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయుడు సతీష్. 16 మ్యాచ్‌ల రౌండ్‌లో జమైకన్ రికార్డో బ్రౌన్‌ను 4-1 తేడాతో ఓడించాడు. ఒలంపిక్స్ లో పతకం సాధించటానికి కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు.
మెన్స్ 91 కేజీల సూపర్ హెవీవెయిట్ బాక్సింగ్ విభాగం ప్రీక్వార్టర్ ఫైనల్స్ బౌట్ లో సతీష్ కుమార్ జమైకాకు చెందిన రికార్డో బ్రౌన్‌తో తలపడ్డాడు. ఎన్నో అంచనాల నడుమ బాక్సింగ్ బరిలోకి దిగాడు 31 ఏళ్ల బ్రౌన్. 1996 తర్వాత మెన్స్ 91 కేజీల సూపర్ హెవీవెయిట్ బాక్సింగ్ విభాగంలో జమైకా తరపున బ్రౌన్ బరిలోకి దిగాడు. అయితే బ్రౌన్ పై సతీష్ కుమార్ మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించాడు.. తన హెవీ వెయిట్ పంచ్ లతో విరుచుకుపడ్డాడు.. తీవ్ర ఒత్తిడికి గురైన బ్రౌన్ పై విక్టరీ సాధించి క్వార్టర్ ఫైనల్ లో అడుగు పెట్టాడు.
జమైకా కు చెందిన బ్రౌన్ కే కాదు సతీష్ కుమార్ కూడా ఇదే మొదటి ఒలంపిక్స్. 32 సంవత్సరాల సతీష్ కుమార్ ఉత్తర ప్రదేశ్ బులంద్‌షెహర్‌కు చెందిన సూపర్ హెవీవెయిట్ బాక్సర్. ఒలంపిక్స్ లో మొదటి సారిగానీ ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ పాల్గొని అద్భుత ప్రదర్శనతో పతకాలను సొంతం చేసుకున్నాడు. 2014లో ఆసియన్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతాన్ని సొంతం చేసుకున్నాడు.
Also Read: ఓ వైపు తోట పనులు చేస్తూనే.. పిహెచ్‌డీ స్థాయికి ఎదిగిన ఓ యువతి .. సివిల్స్ తుది లక్ష్యం అంటున్న వైనం