అశ్లీల వీడియోలకు పాక్ మాజీ​ క్రికెటర్ ట్విట్ట‌ర్ ఖాతా నుంచి​ లైక్​లు..!

|

May 29, 2020 | 4:16 PM

సెలబ్రిటీల సామాజిక మాధ్య‌మాల ఖాతాలు వరుసగా హ్యాక్​కావడం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవ‌ల హీరోయిన‌ పూజాహెగ్డే అకౌంట్ నుంచి మ‌రో న‌టి సమంతపై అభ్యంతర పోస్టులు రాగా.. తాజాగా పాక్​ మాజీ క్రికెటర్​ వకార్​ యూనిస్​కు ఇలాంటి క‌ష్టాలే ఎదుర‌య్యాయి. ఈసారి ఏకంగా అత‌డి ట్విట్ట‌ర్ ఖాతా నుంచి అశ్లీల వీడియోలకు లైక్​లు రావ‌డం గ‌మ‌నార్హం. ఈ విషయాన్ని శుక్రవారం  స్వయంగా తెలిపిన యూనిస్..హ్యాకర్లపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. pic.twitter.com/cl8iZFykVC — Waqar Younis (@waqyounis99) May […]

అశ్లీల వీడియోలకు పాక్ మాజీ​ క్రికెటర్ ట్విట్ట‌ర్ ఖాతా నుంచి​ లైక్​లు..!
Follow us on

సెలబ్రిటీల సామాజిక మాధ్య‌మాల ఖాతాలు వరుసగా హ్యాక్​కావడం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవ‌ల హీరోయిన‌ పూజాహెగ్డే అకౌంట్ నుంచి మ‌రో న‌టి సమంతపై అభ్యంతర పోస్టులు రాగా.. తాజాగా పాక్​ మాజీ క్రికెటర్​ వకార్​ యూనిస్​కు ఇలాంటి క‌ష్టాలే ఎదుర‌య్యాయి. ఈసారి ఏకంగా అత‌డి ట్విట్ట‌ర్ ఖాతా నుంచి అశ్లీల వీడియోలకు లైక్​లు రావ‌డం గ‌మ‌నార్హం. ఈ విషయాన్ని శుక్రవారం  స్వయంగా తెలిపిన యూనిస్..హ్యాకర్లపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

“నా సోష‌ల్ మీడియా అకౌంట్స్ హ్యాక్​ అయ్యాయి. వాటి నుంచి వ‌చ్చిన ఎటువంటి పోస్టుల‌ను ప‌ట్టించుకోవ‌చద్దు. ఇక జీవితంలో సోషల్​మీడియా వాడకూడదని డిసైడ్ అయ్యా. ఇన్నిరోజులు నన్ను ఫాలో అయిన ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు. నా డెషిస‌న్ మిమ్మల్ని బాధపెడితే క్షమించండి” అని వకార్​ యూనిస్ పేర్కొన్నాడు.

వకార్‌ యూనిస్‌ అకౌంట్లను హ్యాక్‌ చేసి అశ్లీల‌‌ వీడియోలకు లైక్​లు కొట్టడం ఇప్పుడు కొత్త‌గా జ‌రిగిందేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు అత‌డు చాలాసార్లు ఎదుర్కొన్నాడు. ఈ ప‌రిణామాలతో విసుగు చెందిన వ‌కార్ యూనిస్.. సోషల్​మీడియాకు గుడ్​బై చెప్తున్నట్లు వెల్ల‌డించాడు.