Ben Stokes: సన్ రైజర్స్ జట్టు లోకి బెన్ స్టోక్స్..!.. విదేశీ స్టార్ ఆటగాళ్లు సైతం.. అభిమానుల్లో ఉత్కంఠ..

|

Nov 24, 2022 | 7:24 AM

ఐపీఎల్‌ - 2023 సీజన్‌ మినీ వేలానికి గడువు ముంచుకొస్తోంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాయి. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికరంగా మారుతోంది. వేలం బరిలో నిలిచే...

Ben Stokes: సన్ రైజర్స్ జట్టు లోకి బెన్ స్టోక్స్..!.. విదేశీ స్టార్ ఆటగాళ్లు సైతం.. అభిమానుల్లో ఉత్కంఠ..
Ben Stokes
Follow us on

ఐపీఎల్‌ – 2023 సీజన్‌ మినీ వేలానికి గడువు ముంచుకొస్తోంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాయి. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికరంగా మారుతోంది. వేలం బరిలో నిలిచే విదేశీ స్టార్‌ ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీలు చేజిక్కించుకుంటాయోనని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వేలానికి ఇంకా నెల రోజుల సమయం ఉనప్పటికీ అభిమానులు జట్టుపై కొన్ని అంచనాలు పెట్టుకోవడం గమనార్హం. సామ్‌ కర్రన్‌, బెన్‌ స్టోక్స్‌, సికందర్‌ రజా, కెమరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ హేల్స్‌, ఆదిల్‌ రషీద్‌ ను తమతమ జట్లలో ఉండాలని అన్ని ఫ్రాంచైజీలు, అభిమానులు కోరుకుంటున్నారు. అయితే 10 ఫ్రాంచైజీల్లో ఎక్కువ పర్స్‌ బ్యాలెన్స్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. ఈ ఫ్రాంచైజీ వద్ద సుమారు 42.25 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీంతో ఈ డబ్బును ఉపయోగించి, ఎక్కువ మంది స్టార్‌ ఆటగాళ్లను సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ ముఖ్యంగా బెన్ స్టోక్స్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అంతే కాకుండా స్టోక్స్ కే కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చే అవకాశాలూ లేకపోలేదు. ఫ్రాంచైజీ వద్ద ఉన్న డబ్బు ను చూసుకుంటే.. బెన్‌ స్టోక్స్‌తో పాటు అలెక్స్‌ హేల్స్‌, కెమరూన్‌ గ్రీన్‌లను దక్కించుకునేటట్టు కనిపిస్తోంది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, రొమారియో షెపర్డ్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్, శ్రేయాస్ గోపాల్ లను సన్ రైజర్స్ వదులుకుంది.

ముఖ్యంగా సన్ రైజర్స్ ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ ను తప్పించడం అభిమానులకు షాక్ కు గురి చేసింది. విలియమ్సన్ ను విడుదల చేయడం వల్ల సన్ రైజర్స్ కు రూ.14 కోట్లు మిగిలినట్టయింది. విలియమ్సన్ వైఫల్యం సన్ రైజర్స్ పై తీవ్ర ప్రభావం చూపింది. కాగా.. విలియమ్సన్ ను రిలీజ్ చేసినట్టు ప్రకటించిన సన్ రైజర్స్ కేన్ మామా ఎప్పటికీ మనవాడే అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. వచ్చే ఐపీఎల్ వేలంలో కేన్ విలియమ్స్ ను మళ్లీ సన్ రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..